గ్యారేజ్ ఆడియో కి ఆమె డుమ్మా!

సినిమా ప్రొమోషన్స్ విషయంలో హీరోయిన్స్ వ్యవహారశైలిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.సినిమాకి సైన్ చేశామా షూటింగ్ లో మన పార్ట్ కంప్లీట్ అయిపోయిందా రెమ్యూనరేషన్ తీసుకున్నామా వెళ్లిపోయామా అన్న చందాగా తయారైంది ఈ మధ్యన తెలుగు సినిమా హీరోయిన్స్ వ్యవహారం.దీనిపై ఇండస్ట్రీ మొత్తం గుర్రుగానేవుంది.

ఈ మధ్యనే బాబు బంగారం ఆడియో ఫంక్షన్ కి నయనతార రాకపోవడం పలు విమర్శలకు తావిచ్చింది.నయన్ కి ఇది మొదటిసారేమి కాదు.నయనతార తెలుగులో ఒక్క శ్రీ రామ రాజ్యం ఆడియో కి తప్ప వేరే ఏ సినిమాకి రాకపోవడం గమనార్హం.అది కూడా బాపు గారి మీదున్న గౌరవంతోనే వచ్చినట్టు నయన్ చెప్పుకొచ్చింది.నయన తార వ్యవహార శైలి పై ఆ మధ్య దర్శక రత్న దాసరి నారాయణ రావు ఘాటుగానే స్పందించారు.చివరికి బాబు బంగారం హీరో వెంకటేష్ ఈ విషయం పై వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.నయన తార సినిమాకి సైన్ చేసేటప్పుడే ప్రమోషన్ కి రాలేనని తనతో చెప్పినట్టు వెంకీ వివరణ ఇచ్చాడు.అంత బాహాటంగా మేము రాము అని చెప్తున్నా వారి వెంట పడి మరీ తెచ్చుకోవం ఏంటో ఎవరికీ అర్థం కాదు.

అయితే ఈ రోజు రిలీజ్ అవ్వబోతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్ లో రాబోతున్న జనతా గ్యారేజ్ ఆడియో ఫంక్షన్ కి రాలేనంటూ సమంత తేల్చేసింది.అనారోగ్యం సాకుగా చూపి సమంతా ఈ ఆడియో వేడుకకి డుమ్మా కొడుతోంది.నిజంగా అనారోగ్యం అయితే ఎవరు మాత్రం ఏమి చేస్తారు కానీ నయన్ లా నేను రాను అని భీష్మించుకుంటే ఇండస్ట్రీ ఆగ్రహానికి సమంత కూడా గురికాక తప్పదు.అయితే ప్రమోషన్ విషయం లో సమంత ట్రాక్ రికార్డు బాగానే ఉండి.అమ్మడు సినిమా ప్రొమోషన్స్ విషయం లో తనవంతు సాయం చేస్తుందనే ఇండస్ట్రీ టాక్.