ఎన్టీఆర్ భావోద్వేగం వెనుక…

యంగ్‌ టైగర్‌ ఎన్టీయార్‌ వేదాంతం చెబుతున్నాడు. ఈ మధ్య ఎన్టీఆర్‌ చాలా మారిపోయాడు. తనను తాను మార్చేసుకున్నాడు. అనే వార్తలు వినవస్తున్నాయి. అయితే నిజంగానే ఎన్టీఆర్‌ మారాడట. సినిమా కెరీర్‌లో తాను తిన్న దెబ్బలే తనలోని మార్పుకి కారణమంటున్నాడు. ఏదో ఒక సినిమా చేసేద్దాం, ఎలాగైనా చూసేస్తారన్న ఆలోచనతో సినిమాలు చేసే పరిస్థితి ఇప్పుడు లేదని చెప్పాడు. ‘జనతా గ్యారేజ్‌’ విడుదల సందర్భంగా ప్రమోషన్‌ కార్యక్రమాల్లోనే ఉద్వేగంగా కనిపిస్తున్నాడు. ఇంతవరకూ ఏ సినిమా ప్రమోషన్‌లోనూ ఎన్టీఆర్‌ ఇంత యాక్టివ్‌గా కనిపించలేదు.

అలాగే ఎన్టీయార్‌లో మెచ్యూరిటీ లెవల్స్‌ కూడా పెరిగినట్లుగా అతని తీరు కనిపిస్తోంది. ‘టెంపర్‌’ సినిమాలో లౌడ్‌గా, ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలో ఎమోషనల్‌గా నటించి మెప్పించిన ఎన్టీయార్‌, ‘జనతా గ్యారేజ్‌’ సినిమాతో సొసైటీకి మంచి మెసేజ్‌ ఇవ్వబోతున్నాడు. కాలంతో పాటుగా ఎవరైనా మార్పుని స్వాగతించాలి. ఆ మార్పుకి కారణాలేంటో చెబుతున్నాడంటే ఎన్టీయార్‌లో మెచ్యూరిటీ లెవల్స్‌ పెరిగినట్లే కదా. ఇది వేదాంతం కాదు, జీవిత సత్యం. మొత్తానికి ఈ జీవిత సత్యాన్ని తెలుసుకున్నాకే ఎన్టీఆర్‌ మళ్లీ సక్సెస్‌కి దగ్గరయ్యాడు. వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. ఎన్టీఆర్‌ని చూసి చాలా నేర్చుకోవాలి కదా!