ఆమెను విక్రమ్‌ తీసుకొస్తున్నాడు

నయనతార ప్రెజెన్స్‌.. ఇదే ఇప్పుడు ఎక్కడ విన్నా హాట్‌ టాపిక్‌గా మారింది. నయనతార ఎందుకిలా చేస్తుందో తెలీడం లేదు. సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది కానీ సినిమా ప్రమోషన్స్‌కి మాత్రం ఈ ముద్దుగుమ్మ అస్సలు హాజరు కాదు. తెలుగులో అగ్రహీరో అయిన వెంకటేష్‌తో ‘బాబు బంగారం’ సినిమాలో నటించిన నయనతార ఆ సినిమా ప్రమోషన్‌కి హాజరు కాకపోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.

ఈ సినిమా కోసం నయనతార భారీ రెమ్యునరేషన్‌ కూడా తీసుకుంది. కానీ, సినిమా ప్రమోషన్‌ గురించి ఆలోచించలేదు. దాంతో నయనతార వ్యవహారంపై తెలుగులో చాలా చర్చ జరుగుతోంది. ఇంకో వైపున నయనతార నటించిన ఓ సినిమా తెలుగులోకి ‘ఇంకొక్కడు’ పేరుతో విడుదలవుతోంది. విక్రమ్‌ ఈ సినిమాలో హీరో. తన సినిమా ప్రమోషన్‌ కోసం విక్రమ్‌ హైదరాబాద్‌కి వచ్చాడు. ఇక్కడా నయనతార ఆబ్సెంటే. అయితే నయనతారతో కలిసి ఇంకోసారి విక్రమ్‌ ‘ఇంకొక్కడు’ సినిమా ప్రమోషన్‌ కోసం హైదరాబాద్‌ రానున్నాడట.

విక్రమ్‌ రిక్వెస్ట్‌ మేరకు హైదరాబాద్‌కి రావడానికి నయనతార ఒప్పుకుందని తెలియవస్తోంది. అలా నయనతార హైదరాబాద్‌కి వస్తే గనుక, ‘బాబు బంగారం’ గురించిన ప్రవ్నలు ఆమెపైకి దూసుకెళతాయి. ఆ ప్రశ్నలకు నయనతార ఇప్పటినుంచే ప్రిపేర్‌ అవవలసి ఉంటుంది. ఇతర సినిమాల్లో బిజీగా ఉండడం వల్ల రాలేకపోతే, కనీసం ఓ వీడియో బైట్‌ అయినా ప్రమోషన్‌ కోసం నయనతార ఇచ్చి ఉండవచ్చు ‘బాబు బంగారం’ సినిమాపై. అదీ చేయకపోవడంతోనే ఇంత రాద్ధాంతం జరుగుతోంది.