ఆగస్టు 8న జిఎస్‌టి బిల్లుపై లోక్‌సభలో చర్చ

లోక్‌సభలో సోమవారం జిఎస్‌టి బిల్లుపై చర్చ చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. అలాగే ప్రధాని ప్రమేయంతో వివిధ రాష్ట్రాల్లోని శాసన సభల్లో కూడా దినికి ఆమోదం లభించేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కాగా సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టబోయే ఈ బిల్లుకు ఆమోదం ఆరోజే ఆమోదం పొందుతుందని భావిస్తున్నామని ఒక సీనియర్ కేంద్ర మంత్రి చెప్పారు.

అలాగే ఆరోజు జిఎస్‌టి బిల్లుపై ప్రధాని మోడీ చర్చను ప్రారంభిస్తారని తెలిపారు. కాగా ఇప్పటికే రాజ్యసభలో జిఎస్‌టి బిల్లు ఆమోదం పొందిన విషయం విదితమే! కాగా కాంగ్రెస్ నేత జైరామ్ రమేష్ మాట్లాడుతూ స్వతంత్ర భారతావనిలో ఒక ప్రధాని ఈవిధంగా రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టడం ఇది తొలిసారని అభివర్ణించారు