అప్పట్లో శ్రీదేవి ఇప్పుడు కాజల్

సినిమాల్లో కొన్నికాంబినేషన్స్ భలే గమ్మత్తుగా ఉంటాయి.ఒకప్పుడు శ్రీదేవి ఎన్టీఆర్ కి మానవరాలుగా నటించింది.అదే శ్రీదేవి ఎన్టీఆర్ తో జతకట్టి అనేక హిట్ సినిమాల్లో నటించింది.ఆ తరువాత శ్రీదేవి నాగేశ్వర్ రావు తో స్టెప్పులేసింది.ఆ తరువాత ANR వారసుడు నాగార్జునతోనూ పలు సినిమాల్లో జతకట్టి అభిమానుల్ని అలరించింది.

అలాంటి క్రేజీ కొన్నికాంబినేషన్స్ ఈ మధ్య కనబడటం లేదు.దీనికి ప్రధాన కారణం ఈ మధ్య హీరోయిన్స్ కి మహా అయితే 3 – 4 సంవత్సరాలకంటే ఎక్కువ మనుగడ ఉండటం లేదు.అయితే అందాల భామ కాజల్ ఓ అరుదైన ఘనత సొంతం చేసుకుంది.రామ్ చరణ్‌తో..మగధీర, నాయక్, గోవిందుడు అందరి వాడేలే, ఎవడు చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ మెగాస్టార్ చిరంజీవితోనూ జోడీ కడుతోంది. చిరు 150 సినిమాకు కాజల్‌ను ఫైనల్‌ చేసేశారు. ఈ అమ్మడు మెగా ఫ్యామిలీకే చెందిన మరో ఇద్దరు స్టార్స్‌తోనూ వెండితెరపై సందడి చేసింది. అల్లు అర్జున్‌, పవన్ కల్యాణ్‌లతోనూ నటించింది.