సిక్స్ ప్యాక్ చేస్తున్న కల్యాణ్

పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఇజం’. ప్రస్తుతం ఈ సినిమా.. చిత్రీకరణ దశలో వుంది. ఈ చిత్రం ఫస్టులుక్ లో కల్యాణ్ రామ్ స్ట్రక్చర్‌ చాలా ఆసక్తిగా మారింది. ఎందుకంటే కల్యాణ్ రామ్ కాస్త సన్నగా కనిపించారు. ఆయన లుక్ అందరినీ ఆశ్చర్యపరిచింది.

‘ఇజం’లో హీరో రోల్ కోసం బరువు తగ్గవలసి ఉంటుందనీ .. సిక్స్ ప్యాక్ తో కనిపించాల్సి ఉంటుందని పూరీ ముందుగానే కల్యాణ్ రామ్ కి చెప్పాడట. అందుకే ఆయన ఇలా సన్నగా మారిపోయాడట. ‘ఇజం’ కోసం కల్యాణ్‌రామ్ చాలానే కష్టపడ్డారు. 11 కేజీలు బరువు తగ్గినట్టుగా ఓ సందర్భంలో ఆయనే చెప్పాడు. ఈ లుక్‌లో బాగున్నానని తన పిల్లలు చెబుతూ వుంటే హ్యాపీగా ఉందని కల్యాణ్ రామ్ అన్నాడు.

పూరీ తన హీరోలను సిక్స్‌ప్యాక్‌లో చూపిస్తుంటాడు. ‘దేశముదురు’లో అల్లు అర్జున్‌నూ ఇలానే చూపించి ఆసక్తి రేకెత్తించాడు. ‘టెంపర్’ లో ఎన్టీఆర్ ను సిక్స్ ప్యాక్ లో చూపించిన పూరీ, ‘ఇజం’తో కల్యాణ్ రామ్ నూ అదే లుక్‌లో చూపించనుండటం విశేషం.