సమంత – చైతు సస్పెన్స్‌ ఎప్పటిదాకా? 

హీరోయిన్‌గా మంచి జోరుగా కెరీర్‌ సాగుతున్న టైంలో పెళ్లి, పెళ్లి అని అనవసరంగా తనంతట తానే సమంత రకరకాలుగా సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తోంది. బోయ్‌ ఫ్రెండ్‌ని సస్పెన్స్‌లో పెట్టినట్లే పెట్టి, అన్ని రకాల హింట్స్‌ ఇచ్చేసింది సమంత. సమంతకు హీరో నాగచైతన్యకూ మధ్య ఎఫైర్‌ ఉందనీ, అందరికీ తెలియకనే తెలిసిపోయింది. అంతేకాదు అది కాస్త ముదిరి ఈ ఇద్దరూ పెళ్ళి పీటలెక్కబోతున్నారని టాక్‌ కూడా తెగ హల్‌ చల్‌ చేస్తోంది. అయితే దీన్ని అక్కినేని ఫ్యామిలీ ఇంతవరకు ఖండించలేదు, అలా అని సమర్థించలేదు. సమంత కూడా డైరెక్ట్‌గా కన్‌ఫామ్‌ చెయ్యలేదు.

కానీ ఇరువురికీ ఈ విషయంలో ఏ విధమైన అభ్యంతరాలు లేవనే మాత్రం తెలుస్తోంది. అయితే మంచి ముహూర్తం కోసం ఎదురుచూస్తున్నారనే గాసిప్స్‌ ఇంకా వినవస్తూనే ఉన్నాయి. ఇది కేవలం గాసిప్సేనా, లేకపోతే నిజమా అనే డైలమాలో ఇటు సమంత అభిమానులు, అటు అక్కినేని అభిమానులు ఉన్నారు. కొన్ని రోజుల్లోనే దీనిపై నాగార్జున క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాడని సమాచారమ్‌. అలాగే అఖిల్‌ లవ్‌ ఎఫైర్‌ గురించి తాజాగా రూమర్స్‌ బయటికి వచ్చాయి. ఈ రూమర్స్‌కి కూడా నాగార్జున చెక్‌ పెట్టేస్తాడట. అయితే ఆ చెక్‌ పెట్టడం ఎలాగనేదే మళ్ళీ సస్పెన్స్‌లా మారింది. ఒకవేళ ఇద్దరు అన్నదమ్ములకు ఒకేసారి నిశ్చితార్ధం చేసేస్తాడా? లేక అఖిల్‌ ప్రేమాయణానికి మరి కొంత టైం కేటాయిస్తాడా అనేది మాత్రం తెలిసి రావడంలేదు.