‘శాతకర్ణి’లో మోక్షజ్ఞ పాత్ర అదేనా!

గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాలో నటిస్తున్నాడు మోక్షజ్ఞ. తన కుమారుడిని తన చిత్రంతోనే తెరంగేట్రం చేయించాలనుకున్న బాలకృష్ణకు ఈ సినిమా ద్వారా ఆ కోరిక నెరవేరుతోంది. అయితే ఈ సినిమాలో మోక్షజ్ఞ పాత్ర ఏంటో తెలియడంలేదు. ప్రాథమికంగా అందుతున్న సమాచారం ప్రకారం తెరపై కాస్సేపు మాత్రమే కనిపిస్తాడట మొక్షజ్ఞ. రాజకుమారుడిలా మోక్షజ్ఞని చూపించబోతున్నారని సమాచారమ్‌. దీని కోసం ఇప్పటికే కెమెరా టెస్ట్‌, ఫొటో షూట్‌ జరిగినట్లు తెలియవస్తోంది.

తొలి ఫోటో షూట్‌ తన తండ్రి సినిమా కోసం జరిగినందుకు మోక్షజ్ఞ కూడా చాలా సంతోషంగా వున్నాడట. ఈ సినిమాలో తన పాత్ర చిన్నదే అయినప్పటికీ సినిమా షూటింగ్‌ మొదలైనప్పట్నుంచీ మోక్షజ్ఞ తన తండ్రిని అనుసరిస్తూనే ఉన్నాడట. సెట్స్‌లో తండ్రితో పాటు తాను కూడా రెగ్యులర్‌గా పాల్గొంటున్నాడట. ఇదిలా ఉండగా ఓ సూపర్‌ మాస్‌ డైరెక్టర్‌ చేతిలో బాలకృష్ణ, తన కుమారుడి భవిష్యత్తుని ఉంచాడనీ, ఆ డైరెక్టర్‌ చేసే సినిమాతో మోక్షజ్ఞ అతి త్వరలో హీరోగా ఎంట్రీ ఇస్తాడని సమాచారం అందుతోంది.

అదీ కాక మరో పక్క మోక్షజ్ఞని పక్కా మాస్‌ హీరోగా కాకుండా, తొలుత సింపుల్‌ లవ్‌ స్టోరీతో లవర్‌ బాయ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలనే యోచనలో కూడా బాలకృష్ణ ఉన్నాడట. మొట్ట మొదటి సినిమాకు భారీ హంగామా ఏమీ చేయకుండా జనానికి ఈజీగా దగ్గరయ్యే స్టోరీతో పరిచయం చేయాలనుకుంటున్నాడట. అభిమానులు మోక్షని ఏ రకంగా ఇష్టపడతారో గుర్తించి, అందుకు తగ్గ విధంగా తనకి ప్లాట్‌ ఫాం సిద్ధం చేయాలనుకుంటున్నాడట బాలకృష్ణ. వావ్‌ వాట్‌ ఏ ఫాదర్‌!