మొన్న అనసూయ ఇప్పుడు రెజీనా..

అవకాశాలున్నప్పుడు నాలుగు రాళ్ళూ వెనకేసుకోవాలి,అవకాశాలు లేకపోతే అవకాశాల్ని కల్పించుకోవాలి.ఇదీ కొత్తేమి కాదు కానీ..దీన్ని తూచా తప్పకుండ ఎవరు పాటించకపోయినా హీరోయిన్స్ మాత్రం పద్దతిగా ఫాలో అవుతారు.క్రేజ్ వున్నప్పుడు కాసులు వేనేకేసుకోవడం క్రేజ్ తగ్గగానే క్రేజ్ కోసం ఫోటోషూట్స్ తో హాట్ హాట్ గా అందరి దృష్టిలో పడడటం హీరోయిన్స్ కి బాగా తెలిసిన విద్యే.

నిన్న గాక మొన్న జబర్దస్త్ ప్రోగ్రామ్ తో పాపులర్ అయ్యి వెండితెర మీద దర్శనమిచ్చిన అనసూయ భరద్వాజ్ హాట్ హాట్ గా కెమెరాకు ఫోజులిచ్చిన సంగతి అందరికి తెలిసిందే.అనసూయా అలా షూట్ ఇచ్చిందో లేదో ఇలా సోషల్ మీడియా లో అమ్మడిగురించే కబుర్లు.తన తోటి యాంకర్ రేష్మి అందాలు ఆరబోసి అవకాశాల్ని కొల్లగొట్టేస్తుంటే పాపం అనసూయకి అసూయ కలిగి తానేం రేష్మీకి తక్కువ కాదన్నట్టు హాట్ హాట్ గా ఫోటో షూట్ చేసి వార్తల్లో నిలిచింది.

ఇదిలా ఉంటే రకుల్ ప్రీత్ సింగ్ సౌత్ స్కోప్ మ్యాగజైన్ కి హాట్ హాట్ ఫోజులతో ఫోటోలకు ఫోజులిచ్చిన సంగతి కూడా సోషల్ మీడియా లో ప్రచారమైన సంగతి తెలిసిందే.అయితే తాజాగా అవకాశాలు తగ్గిన హాట్ హీరోయిన్ రెజీనా కూడా తానేం తక్కువా అంటూ హాట్ హాట్ గా ఒక ఫోటో షూట్ చేయించుకుంది.కెరీర్ బిగినింగ్ లో రెజీనా చేతినిండా సినిమాలే ఉండేవి.అయితే అమ్మడు ఎంత అందచందాల్ని ఒలకబోసినా..లిప్ లాక్ లు చేస్తున్నా ఎందుకనో అవకాశాలు రావడం లేదు పాపం.అందుకే ఇలా అయితే లాభం లేదనుకుందో ఏమో..హాట్ హాట్ గా ఒక ఫోటో షూట్ చేయించుకుంది.

సినిమాల్లో మడికట్టుకుని కూర్చుంటే కుదరదని ఎక్సపోజింగ్ చేస్తేనే కొన్నాళ్ళు ఇండ్రస్టీలో నిలబడగలమని తెలుసుకునే ఇలా హాట్ గా ఫోటో షూట్ చేయించుకుందని ఆమె ఫొటోస్ చూసిన వారు అనుకోవడం విశేషం. మరి విషయమేమైనా గాని రెజీనా హాట్ ఫొటోస్ మాత్రం సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తున్నాయి.