మనోజ్ తో కంచె కుర్రది!

‘కంచె’ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ మంచు మనోజ్‌తో జోడీకట్టనుంది. టి.సత్య తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అందాల ప్రగ్యాను కథానాయికగా చిత్రబృందం ఖరారు చేసింది. ‘కంచె’లో అభినయానికి ప్రాధాన్యత ఉన్న పాత్రను పోషించింది ప్రగ్యా. గ్లామర్ పరంగానూ మార్కులు కొట్టేసింది. మరి లేటెస్ట్ మూవీలో ఆమె ఓ క్యారక్టర్‌లో మెరవనుందో ఆసక్తిగా మారింది.

తెలుగు తెరకి పరిచయమై అవకాశాలను అందిపుచ్చుకుంటూ దూసుకెళుతోన్న హీరోయిన్స్‌లో ప్రగ్యా జైస్వాల్ ఒకరు. తొలి చిత్రమైన ‘కంచె’తోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. మంచు మనోజ్‌ చిత్రంతో పాటూ ప్రగ్యా నాగార్జున భక్తి చిత్రమైన ‘ఓం నమో వేంకటేశాయ’ సినిమాలోను ఒక ముఖ్యమైన భూమికను పోషిస్తోంది.