బుడ్డోడి బర్తడే రోజు NTR బంపర్ ఆఫర్

యంగ్ టైగర్ NTR జీవితంలో జరిగిన అతిపెద్ద చిన్న మార్పు ఏంటని ఒక యాంకర్ అడగ్గా తన కొడుకేనని బదులిచ్చాడు.నిజమే నందమూరి అభయ్ రామ్ రాక NTR జీవితంలో నిజంగా పెద్ద పండుగే.అయితే అభయ్ రామ్ మొదటి పుట్టినరోజుకి NTR నాన్నకి ప్రేమతో షూటింగ్ లో భాగంగా లండన్ లో వుండిపోవడంతో అభయ్ నే లండన్ కి పిలిపించుకుని పుట్టినరోజు వేడుకలు అక్కడే నిర్వహించాల్సి వచ్చింది.

కాగా ఈసారి అభయ్ పుట్టిన రోజు ఎలాగైనా నందమూరి అభిమానుల సమక్షంలో జరపాలని ఎప్పటినుండో పట్టుదలగా వున్న NTR ఈ సారి జనతా గారేజ్ ఆడియో ఫంక్షన్ లోనే అభిమానుల ఆశీర్వాదాలతో అభయ్ రామ్ పుట్టినరోజు వేడుకని ఘనంగా నిర్వహించటానికి ఏర్పాట్లు చేస్తున్నాడట.