‘బాహుబలి’ని క్రాస్ చేసిన కబాలి

ఒకప్పుడు ఫలానా సినిమా 100 రోజులు ఇన్ని సెంటర్లలో ఆడింది అదే ఇప్పటివరకు రికార్డు అని చెప్పుకునే వారు.దాన్నే బెంచ్ మార్క్ గా మిగతా సినిమాలు పోటీ పడేవి.అయితే కాలం మారింది.ఇప్పుడంతా కలెక్షన్స్ లెక్కలే ఏ సినిమాకైనా.అందులోనా కలెక్షన్స్ ని అందరు రెండుగా చూస్తున్నారు..బాహుబలి కి ముందు.. బాహుబలి తరువాత అని..అంతలా సౌత్ సినిమా రేంజ్ ని పెంచేసింది మన బాహుబలి.ఇప్పుడు ఏ సినిమా రిలీజ్ అయినా సరే బాహుబలి కలెక్షన్ తో లెక్క కడుతున్నారు..అందరికి అదే బెంచ్ మార్క్ మరి.

అయితే తాజాగా రిలీజ్ అయినా సూపర్ స్టార్ రజినీకాంత్ కబాలి బాహుబలి రికార్డ్స్ ని క్రాస్ చేస్తుందా లేదా అన్న టాక్ రిలీజ్ కి ముందు నుండి నడుస్తోంది.అయితే సినిమా రిలీజ్ అయి డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది.ఇప్పటికే 3-4 రోజులకి అడ్వాన్ బుకింగ్స్ అయిపోయాయి..సినీ పండితులు ఊహించినట్టే కబాలి యూఎస్ ప్రీమియర్ షోల విషయంలో ‘బాహుబలి’ రికార్డును క్రాస్ చేసేసింది. యూఎస్ ప్రీమియర్ షోల ద్వారా ‘బాహుబలి’ 1,395,309 డాలర్లను కైవసం చేసుకుంది. కబాలి 1.45 మిలియన్ డాలర్లను రాబట్టింది.

ఎప్పటికైనా యూఎస్ ప్రీమియర్ షోల వసూళ్ల విషయంలో ‘బాహుబలి’ రికార్డును మళ్ళీ రాజమౌళే బాహుబలి-2 తోనే క్రాస్ చేస్తాడని అంతా అనుకున్నా,రజిని వచ్చేసాడు..క్రాస్ చేసేసాడు.స్టైలిష్ గా వచ్చిన ‘కబాలి’ సునాయాసంగా భారీ వసూళ్లను రాబట్టడం రజనీ అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తోంది.