ప్రేమ అనే ఒక పిచ్చి:రామ్ రాశిఖన్నా

రామ్‌ యాక్టివ్‌నెస్‌ గురించి టాలీవుడ్‌లో తెలీనిది ఎవరూ లేరు. ఈ ఏడాది ‘నేను శైలజ..’ సినిమాతో విజయం సాధించాడు రామ్‌. ఇదే కాన్ఫిడెన్స్‌తో మళ్లీ ‘హైపర్‌’ సినిమాతో హైపర్‌ ఎంటర్‌టైన్‌ చేయాలనుకుంటున్నాడు. సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. గతంలో సంతోష్‌తో రామ్‌ ‘కందిరీగ’ సినిమాలో నటించాడు. హన్సిక, అక్ష ఇద్దరు ముద్దుగుమ్మలతో రొమాన్స్‌ చేశాడు రామ్‌ ఈ సినిమాలో.

తాజా సినిమాలో రామ్‌ రాశీఖన్నాతో జత కడుతున్నాడు. రాశీఖన్నాతో రామ్‌ ‘శివమ్‌’ సినిమాలో నటించాడు. వీరిద్దరి మధ్యా ఆ సినిమాలో కెమిస్ట్రీ బాగా వర్కవుట్‌ అయ్యింది. అందుకే ఈ సినిమాలో కావాలని రాశీనే ఎంచుకున్నాడట రామ్‌. అంతేకాదు దగ్గరుండి రామ్‌, రాశీకి డాన్సులు నేర్పించేవాడట ఈ సినిమాలో. కష్టమైన స్టెప్పులను ఎలా ఈజీగా వేయాలో చెప్పేవాడట. అంతే కాదు ఈ సినిమాతో రాశీకి డాన్సులంటే భయం పోయి, డాన్స్‌పై మంచి ఇంట్రెస్ట్‌ కూడా వచ్చిందనీ అంటోంది.

అప్పట్నుంచీ వీరిద్దరకీ మధ్య స్నేహం ముదిరింది. రామ్‌ చాలా స్మార్ట్‌ గురూ అని ముద్దుగుమ్మ రాశీఖన్నా యంగ్‌ హీరో రామ్‌ని తెగ పొగిడేస్తోంది కూడా. రామ్‌ పక్కన మాస్‌ అప్పీల్‌లో రాశీఖన్నా బాగా సూటవుతుంది అని అంటారట అంతా. మామూలుగా క్లాస్‌గా కనిపించే రాశీ, రామ్‌తో డాన్సులు చేస్తుంటే ఆటోమెటిగ్గా మాస్‌ లుక్‌లో కనిపించేస్తానంటోంది. ఏంటో ఏం మాయ చేశాడో రామ్‌, ముద్దుగుమ్మ రాశీఖన్నాని.. ఇంతలా ఆకాశానికెత్తేస్తోంది.