న్యూడ్ సుందరి సెల్ఫీ బుక్ కావాలా?

న్యూడ్‌గా ఫోజులిస్తూ అందరి మతుల్ని పోగొట్టే.. కిమ్ కార్దాషియాన్.. ఇప్పుడు సెల్ఫీలతో  ఓ బుక్ రిలీజ్ చేసేసింది అందులో తను దిగిన 300 ఫొటోలను పెట్టిందట. ఆ పుస్తకం కోసం అందరూ ఎగబడుతున్నారట.. అంతేకాదు..35యేళ్ల.. ఈ సుందరితో ఫొటోలు దిగేవారికి ఓ రేట్ ఫిక్స్ చేసి…ఏకంగా  7లక్షల డాలర్లు సంపాదించేసింది. కిమ్ సొంతంగా ఒక యాప్‌ని కూడా లాంఛ్ చేసింది. అందులో తన అవుట్‌ఫిట్స్, యాక్ససెరీస్‌తో నింపేసింది.

డబ్బు సంపాదించడానికి సవాలక్ష మార్గాలుంటాయని కిమ్ కొత్త పదాన్ని వల్లె వేస్తోంది. ఇప్పుడు తనతో సెల్ఫీ దిగాలంటే.. డబ్బులు చెల్లించాల్సిందేనంటూ షరతులు పెడుతోంది. న్యూయార్క్‌లోని ఫ్యాషన్ బ్రాండ్ రివాల్వ్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఒక ప్రైవేట్ జెట్‌లో ఇరవై ఐదు మంది బాడీగార్డ్‌లతో మరో పార్టీకి అటెండ్ అయిందట కిమ్. అలా వచ్చి.. కాసేపు ఆ పార్టీలో మెరిసినందుకు దాదాపు ఒక మిలియన్ డాలర్లు తీసుకుంది.

అయినా అంత అందగత్తె కాసేపు కనబడితే చాలు.. ఎంతైనా చెల్లించడానికి రెడీ అంటున్నారు చాలామంది. జస్ట్ ఈ బుక్ కాస్ట్ 1360 రూపాయిలేనంట…