‘నేను లోకల్‌’ అంటున్న నాని!

యూత్‌ హీరోస్‌లో నాని తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇమేజ్‌ చట్రంలో ఇరుక్కుపోకుండా విభిన్న పాత్రలు చేస్తూ దూసుకెళ్తున్నాడు. నాని సినిమా అంటే కొత్తదనం గ్యారంటీ అన్న ఫీలింగ్ ప్రేక్షకుల్లో కలిగించాడు. ‘జెంటిల్‌మన్‌’తో ఈ భావనకు నూరుశాతం న్యాయం చేశాడు. ప్రస్తుతం నాని చేస్తున్న ప్రాజెక్టుల్లో త్రినాథ్ రావు తెరకెక్కిస్తున్న సినిమా ఒకటి. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. లవ్ ఎంటర్టైనర్‌గా సాగే ఈ చిత్రానికి ‘నేను లోకల్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట.

‘నేను లోకల్’ అనే డైలాగ్ రవితేజ సినిమా ‘ఇడియట్’లోనిది. అప్పట్లో ఈ డైలాగ్‌ ఎంత ఫేమస్‌ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ పిక్చర్‌లో నాని పూర్తిస్థాయి మాస్‌ రోల్‌ పోషిస్తున్నట్లు సమాచారం. అందుకే ఈ సినిమాకు ‘నేను లోకల్’ అని పేరు పెడితే బాగుంటుందని అనుకుంటున్నారట.