నాయుడుగారి సేవ – నెల్లూరు స్వాహా

కేంద్ర మంత్రి,బీజేపీ మాజీ అధ్యక్షుడు,ప్రత్యేక హోదా విషయం లో ఆంధ్ర ప్రదేశ్ ని నట్టేట ముంచిన మొనగాడు..ఈ పాటికే అర్థం అయుంటుంది ..ఆ ఘనాపాటి ఎవరో కాదు మన వెంకయ్య నాయుడు గారే అని.నాయుడు గారి ప్రత్యేక చిందులగురించి ఇప్పుడు మాట్లాడటానికేముంది కానీ నాయుడు గోరు గురివింద నీతులు నెల్లూరులో మరో సారి బయటపడ్డాయి.

మైక్ దొరికే ఉపన్యాసాలు దంచేసే వెంకయ్య గారు అధికార ముసుగులో పెద్ద ప్లాన్ వేశారు నెల్లూరు నగరం లో.ఎప్పుడూ నీతి, నిజాయితీ గురించి వల్లె వేస్తుంటారు. ఏది అడిగినా నిబంధనల ప్రకారమే చేయాలని చెబుతుంటారు. అందరూ రూల్స్‌ పాటించాల్సిందేనంటూ ప్రజలకు హితబోధ చేస్తుంటారు.పాపం తన దాకా వస్తే ఆ రూల్స్ అన్నీ పక్కకు తప్పుకోవాలంటున్నారు. ఇదంతా దేని గురించి అనుకుంటున్నారా?కార్పొరేషన్ అనుమతి లేకుండానే నెల్లూరు నగరంలో సేవ పేరిట కోట్ల రూపాయల విలువైన పార్కు స్థలాన్ని ఆక్రమించారు. వెంకయ్య నాయుడు కుమార్తె నిర్వహించే ట్రస్టు ఏకంగా ఆ భూమిలో భవన నిర్మాణ పనులు సైతం మొదలుపెట్టింది.

నెల్లూరు నగరం నడిబొడ్డున వేదాయపాళెంలో 18 సెంట్ల భూమిని ప్రజా ప్రయోజనాల కోసం ఖాళీగా ఉంచారు.ఇక్కడ పార్కును అభివృద్ధి చేయాల్సి ఉంది.అయితే దాని పక్కనే నాయుడు గారి ఇల్లుకూడా ఉంది.ఇంకేముంది బాబుగారి కన్ను ఈ పార్క్ స్థలం పైన పడింది.ఎలా లేదన్న ప్రస్తుతం మార్కెట్ విలువ ప్రకారం చూసుకుంటే దీని విలువ 7 కోట్లకు పైమాటే.ఇంకేం వెంటనే నాయుడుగారి ఫ్యామిలీ పావులు కదిపింది.వెంకయ్య నాయిడు కుమార్తె దీపా వెంకట్ మేనేజింగ్‌ ట్రస్టీగా వెంకటాచలంలో స్వర్ణభారత్‌ ట్రస్టును నిర్వహిస్తున్నారు.అక్కడ చేస్తున్న సేవ సరిపోదన్నట్లు..నెల్లూరు నగరం లో కూడా ‘సేవ’ ను విస్తరించడానికి ఈ స్థలంపై వాలిపోయారు.ఆ 18 సెంట్ల భూమిని తమ ట్రస్టుకు అప్పగిస్తే కంటి, దంత వైద్యశాల నిర్మించి ప్రజాసేవ చేస్తారంట పాపం తండ్రి కూతుళ్లిద్దరూ!!

ఇంకేముంది కార్పొరేషన్ కి లేఖ రాయడం వాళ్ళు అగ్గ మేఘాలపై కదలడం అన్నీ చకా చకా జరిగిపోయాయి.అయితే దీనికి స్టాండింగ్ కమిటీలో ఆమోదం లభించలేదు.వెంటనే అడ్డదార్లన్నీ వెతికారు.చివరకు కౌన్సిల్‌ సమావేశంలో చర్చించాలని తీర్మానించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం లే-అవుట్లలో వదిలిన ఖాళీ స్థలాలను ఇతర అవసరాలకు ఉపయోగించకూడదు. పార్కు కోసం వదిలిన స్థలాన్ని అందుకే వినియోగించాలి.అయినా ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి కార్పొరేషన్‌ అధికారులు ఈ భూమిని ట్రస్టుకు అప్పగించేందుకు రంగం సిద్ధం చేశారు.

కేంద్రంలో తమ ప్రభుత్వమే అధికారంలో ఉండటం, రాష్ట్రంలోనూ మిత్రపక్ష అండదండలు పుష్కలంగా ఉండటంతో గత నెలలోనే ఆ పార్కు భూమిని స్వర్ణ భారత్‌ ట్రస్టు నిర్వాహకులు కబ్జా చేశారు.ఇంకా కార్పొరేషన్ అనుమతి రానే లేదు అప్పుడే నాయుడు గారు ‘సేవ’కార్యక్రమాలు మొదలు పెట్టేసారు.దీనిపై అధికారులు నోరుమెదపడం లేదు.ఎంతైనా నాయుడు గారికి ప్రజా ‘సేవ’అంటే కసి అలాంటిది పాపం….