క్రిష్ నోట శాతకర్ణి రిలీజ్ డేట్!

బాలయ్య సినిమా అంటే నందమూరి అభిమానులకే కాదు.. సినీ ప్రియులకూ ఆసక్తే. ఇప్పుడు అందరి దృష్టీ ఆయన నటిస్తున్న హిస్టారికల్ గౌతమీపుత్ర శాతకర్ణిపైనే ఉంది. షెడ్యూల్ ప్రకారం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగిపోతోంది. సాధారణ జనాల్లోనే కాక.. సినీ వర్గాల్లోనూ ఉత్సుకత రేకెత్తిస్తున్న ఈ మూవీ రిలీజ్‌ డేట్‌పై దర్శకుడు క్రిష్ స్పందించాడు. ముందుగా అనుకున్న ప్రకారమే జనవరి 12న బాలయ్య చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని చెప్పాడు.

అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’ ట్రైలర్ లాంఛింగ్ ఈవెంట్ కు వచ్చిన క్రిష్.. బాలయ్య సినిమా విడుదల తేదీపై గుట్టు విప్పేశాడు. ‘గౌతమీపుత్ర’ను సంక్రాంతికే థియేటర్స్‌కు తీసుకువస్తామని వివరించాడు. క్రిష్ ప్రస్తుతం తన పెళ్లి పనులతో తీరికలేకుండా ఉన్నాడు. ఈ వేడుకలు పూర్తి కాగానే.. చిన్న గ్యాప్ తీసుకుని మిడ్ ఆగస్ట్‌లో గౌతమిపుత్ర శాతకర్ణి షూటింగ్ తిరిగి ప్రారంభం కానుంది. దర్శకుడి నోటి నుంచే ఈ సినిమా రిలీజ్ డేట్ వినిపించడంతో.. బాలయ్య అభిమానుల్లో సందడి మొదలైపోయింది.