కెసిఆర్ కి బిగుస్తున్న మల్లన్న ఉచ్చు

మల్లన్న సాగర్ ఏ ముహూర్తాన మొదలు పెట్టారో కానీ అడుగడునా అధికార పార్టీ కి ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. ప్రతిపక్షమే లేకుండా చేసిన కెసిఆర్ కి మల్లన్న రూపంలో అసలైన ప్రతిపక్షం పుట్టుకొచ్చింది.రోజు రోజుకి మల్లన్న వివాదం తీవ్ర రూపం దాలుస్తోంది తప్ప సద్దుమణగడం లేదు.

తాజాగా మెదక్ జిల్లాలోని మల్లన్నసాగర్ ముంపు గ్రామాల్లోతీవ్ర ఉద్రిక్తత నెలకొంది.కొండపాక మండలం ఎర్రవల్లి శివారులో రాజీవ్ రహదారి ముట్టడికి యత్నించిన భూనిర్వాసితులపై పోలీసులు ప్రతాపం చూపారు. లాఠీలతో ముంపు బాధితులపై విరుసుకుపడ్డారు. రెండు సార్లు లాఠీచార్టీ చేశారు. నిర్వాసితులు రాళ్లు రువ్వడంతో పోలీసులు రెండు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపారు.

ఒక్క సారిగా తెలంగాణా రాజకీయం మల్లి వేడెక్కింది.ప్రధాన పత్రికలన్నీ మల్లన్న వివాదం లో ఖాకీల దౌర్జన్యాన్ని ఫొటోలతో సహా ప్రచురించేశాయి.ప్రతిపక్షాలు నిర్వాసితులకు అండగా ఉంటామంటూ ప్రకటించాయి.రైతులపై తెరాస ప్రభత్వ విధానాన్ని అన్ని పక్షాలు ఎండగడుతున్నాయి.ఆత్మ రక్షణలో కెసిఆర్ పడిపోయారు.

ఇప్పటికే కెసిఆర్ ప్రభుత్వానికి కోదండరాం రూపం లో పెద్ద ఎదురు దెబ్బలే తగిలాయి.ఇక తాజా వివాదం తో కోందండరాం మరో సారి తెరాస ప్రభుత్వం పై విమర్సనాస్త్రాలు ఎక్కు పెట్టారు.ప్రజా వ్యతిరేక పాలనని,దౌర్జన్యాల్ని సహిస్తూ,చూస్తూ ఊరుకోము అని హెచ్చరించారు.ప్రతిపక్షాలు ఈ మేరకు మెదక్ జిల్లా బంద్ కు పిలుపునిచ్చాయి.హరీష్ రావు దిద్దుబాటు చర్యలను చేపట్టినా జరగాల్సిన నష్టం జరిగిపోయింది.చూస్తుంటే మల్లన్న వివాదం చిలికి చిలికి గాలివానలా మారి తెరాస ప్రభుత్వానికి పెద్ద ముప్పే తెచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.