కాశ్మీర్ To హైద్రాబాద్:చెర్రీ చమక్

రామ్‌చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అర‌వింద్ నిర్మిస్తున్న సినిమా `ధృవ‌`. ఈ సినిమా శ‌ర‌వేగంగా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. చ‌ర‌ణ్ ఈ చిత్రంలో ఓ సిన్సియ‌ర్ పోలీస్ అధికారిగా న‌టిస్తున్నారు. కాప్ లుక్‌కి అవ‌స‌ర‌మైన విధంగా రూపు రేఖ‌లు మార్చుకుని చెర్రీ వెరీ స్మార్ట్‌గా క‌నిపిస్తున్నాడు. ప్ర‌స్తుతం క‌శ్మీర్‌లో చిత్రీక‌ర‌ణ సాగుతోంది. అక్క‌డ 10 రోజుల పాటు టాకీతో పాటు, ఓ సాంగ్‌ని చిత్రీక‌రించారు. క‌శ్మీర్ షూట్ పూర్తి చేసుకుని చ‌ర‌ణ్ నేటి (గురువారం) సాయంత్రం  హైద‌రాబాద్‌లో అడుగుపెట్టారు.
`ధృవ‌` ఫ‌స్ట్‌లుక్ త్వ‌ర‌లోనే రిలీజ్ కానుంది. అయితే ఈలోగానే క‌శ్మీర్ ఆన్‌లొకేష‌న్ స్టిల్ ఒక‌టి అంత‌ర్జాలంలో హ‌ల్‌చ‌ల్ చేసింది. ఈ స్టిల్‌లో చ‌ర‌ణ్ లుక్ అదిరిపోయిందంటూ ఫ్యాన్స్‌లో, జ‌నాల్లో టాక్ వ‌చ్చింది. చ‌ర‌ణ్ మునుప‌టి కంటే స్మార్ట్‌గా క‌నిపిస్తున్నాడంటూ ప్ర‌శంస‌లొచ్చాయి. గీతా ఆర్ట్స్ ప‌తాకంపై అల్లు అర‌వింద్ ఈ చిత్రాన్ని అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా మాతృక `త‌ని ఒరువ‌న్‌`లో విల‌న్‌గా న‌టించిన అర‌వింద్ స్వామి ఈ చిత్రంలోనూ విల‌న్‌గా న‌టిస్తున్నారు. ర‌కూల్ ప్రీత్‌సింగ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ధృవ చిత్రంలో తెలుగు ప్రేక్ష‌కుల‌కు కోరుకునే అన్ని అంశాలు ఉంటాయి. చ‌క్క‌ని స్టోరీ, గ్రిప్పింగ్‌ స్ర్కీన్‌ప్లేతో  తెర‌కెక్కుతోందని చిత్ర‌యూనిట్ చెబుతోంది. (రామ్‌చ‌ర‌ణ్ శంషాబాద్ (హైద‌రాబాద్) ఎయిర్‌పోర్ట్‌లో అడుగుపెట్టిన‌ప్పుడు కెమెరా కంటికి చిక్కారిలా.  కెమెరా క్లిక్కుల్లో దొరికిన స్టిల్స్ ఇవి)