కబాలి రిలీజ్ డేట్ కన్ఫామ్ అయ్యిందోచ్

సూపర్ స్టార్ రజనీకాంత్ ఫ్యాన్స్ కు ఇది నిజంగా గుడ్ న్యూస్. రజనీ లేటెస్ట్ మూవీ కబాలీ రిలీజ్ పై సందిగ్ధత వీడిపోయింది. సినిమా రిలీజ్ డేట్ కన్ఫామ్ అయింది. సెన్సార్ కూడా పూర్తి చేసుకున్న ఈ క్రేజీ మూవీని ఈనెల 22న విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.

ఇప్పటికే పలుసార్లు వాయిదా పడిన కబాలీ ఎట్టకేలకు రిలీజ్ ముహూర్తం ఖాయం చేసుకోవడంతో ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు. తొలు మార్చిలో అనుకున్న రిలీజ్ ఆ తర్వావ ఏప్రిల్ కు వాయిదా పదిండి. అలా వాయిదా పడుతూ వస్తూ జూలై 15న రిలీజ్ అంటూ పుకార్లు వచ్చాయి. చివరకి జూలై 22ని కబాలీ ఖాయం చేసుకున్నాడు. టీజర్ నుంచి ప్రీ రిలీజ్ బిజినెస్ వరకు కబాలీ సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. దాదాపు రూ.200 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రవంచ వ్యాప్తంగా 6వేల థియేటర్లలో కబాలీని రిలీజ్ చేస్తున్నారు. పారిస్ లోని ప్రఖ్యాత రెక్స్ థియేటర్ లోనూ కబాలీని ప్రదర్శించబోతున్నారు.

మాఫియా నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ ఒక్క కట్ కూడా చెప్పలేదు. యువ దర్శకుడు పా రంజిత్ ఈ మూవీని తెరకెక్కించాడు. రజనీ సరసన రాధికా ఆఫ్టే నటిస్తుందడా.. ఓ కీలక పాత్రలో యువనటి ధన్షిక నటిస్తోంది. తమిళ్ తెలుగుతో పాటు, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. చైనా, జపాన్, మలేషియా, ఇండోనిషియాలో కూడా కబాలీ రిలీజ్ అవుతోంది. మలై భాషలో కూడా ఈ సినిమాను డబ్ చేస్తున్నారు.రెండు వరుస డిజాస్టర్ల తర్వాత రజినీ చేస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి.