‘కబాలి’కి కత్తిరింపులు!

సూపర్‌స్టార్ రజనీకాంత్‌ మూవీకి ఉండే క్రేజ్ ఏ సినిమాకీ ఉండదంటే అతిశయోక్తి కాదు. ఆయన సినిమా వస్తోందంటే దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంటుంది. కబాలికీ అలాంటి రెస్పాన్సే నెలకొంది. వివిధ రకాల ప్రచారం ఆ సినిమాకి విపరీతమైన హైప్ ను తీసుకువచ్చింది. అయితే, శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రానికి రికార్డు స్థాయిలో ఓపెనింగ్ కలెక్షన్లు వచ్చినప్పటికీ, సినిమా సాగతీత ధోరణిలో ఉందన్న టాక్ వచ్చింది.

ప్రధానంగా కొన్ని సన్నివేశాల నిడివి బాగా ఎక్కువవడంతో ప్రేక్షకులు కాస్త బోర్ ఫీలవుతున్నారన్న వార్తలూ వచ్చాయి. ఈనేపథ్యంలో చిత్రబృందం తమ కబాలిని ట్రిమ్ చేయడానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం. సుమారు పదిహేను నిమిషాల నిడివిని తగ్గిస్తారని అంటున్నారు. సోమవారం నుంచి నిడివి తగ్గించిన సినిమాను ప్రదర్శిస్తారని సమాచారం.