ఆ కిరాతకుడు దొరికాడు

తమిళనాడు రాజధాని చెన్నైలో గత వారం పట్టపగలే దారుణంగా హత్యకు గురైన సాఫ్ట్ వేర్ ఉద్యోగి స్వాతి కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నుంగంబాక్కం రైల్వే స్టేషన్ లో స్వాతితో గొడవకు దిగి, ఆ తర్వాత కత్తితో ఆమెపై దాడి చేసిన నిందితుడిని రామ్ కుమార్ గా పోలీసులు గుర్తించారు. స్వాతి ఇంటి సమీపంలో వుండే రామ్ కుమార్ ఆమె మీద మొజు పెంచుకున్నాడు. తమిళనాడులోని తిరునల్వేలిలో రామ్ కుమార్ ఇంజినీర్ గా పనిచేస్తున్నట్లు కనుగొన్న పోలీసులు అతడిని అరెస్ట్ చేసేందుకు నిన్న రాత్రి అక్కడికి వెళ్లారు. అయితే పోలీసులను చూడగానే రామ్ కుమార్ ఆత్మహత్యాయత్నం చేశాడు. బ్లేడుతో అతడు తన గొంతు కోసుకున్నాడు. దీంతో పోలీసులు వెనువెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు.

సంచలనం సృష్టించిన ఈఘటన జరిగిన రోజు ఉదయాన్నే రైల్వే స్టేషన్ లో ట్రైన్ కోసం ఎదరుచూస్తున్న స్వాతిని రామ్ కుమార్ కొడవలితో నరికి పారిపోయాడు. చుట్టూ వున్నవారు ఎవరూ ఆమెని రక్షించడానికి ముందుకురాలేదు. స్వాతి మృదదేహం అక్కడే పడివుంది. దాదాపు రెండు గంటల తరువాత పోలీసులు అక్కడికి చేరుకున్నారు.

మొత్తం వ్యవహారంపై స్పందించిన తమిళనాడు హైకోర్టు నిందితుడిని రెండు రోజుల్లో పట్టుకోవాలని ఆదేశించింది. చెన్నై పోలీసులు, రైల్వే పోలీసుల మధ్య సమన్వయం లేదని మొట్టికాయలు వేసింది.