అల్లువారబ్బాయి అదరగొట్టేసాడు- SS టీజర్

ఓ వైపు అన్నయ్య అల్లు అర్జున్ కెరీర్ లో దూసుకుపోతుంటే తమ్ముడు శిరీష్ మాత్రం సరైన హిట్ లేక రేస్ లో వెనుకబడ్డాడు. కెరీర్ లో చేసినవి రెండే సినిమాలు.గౌరవం తో మొదలుపెట్టి ఆర్టిస్ట్ గా మంచి మార్కులే సంపాదించాడు అల్లు శిరీష్.ఆ తరువాత వచ్చిన కొత్తజంట సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది.

దాంతో చాలా గ్యాప్ తీసుకుని సొంత బ్యానర్ గీత ఆర్ట్స్ లో శ్రీరస్తు శుభమస్తు సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు అల్లు శిరీష్.ఈ సినిమా ఆఫీషియల్ టీజర్ ని ఈ రోజు రిలీజ్ చేశారు.శిరీష్ కి జంటగా లావణ్య త్రిపాఠి నటిస్తుండగా ఈ చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నాడు.మ్యూజిక్ థమన్ అందిస్తున్నాడు.

Click Here For Teaser

టీజర్ అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా వుంది.ఇది మంచి యూత్ఫుల్ ఫామిలీ ఎంటర్టైనర్ అని టీజర్ చూస్తే అర్థం అయిపోతుంది.ఇందులో కామెడీ కి కూడా పెద్ద పీట వేసినట్టే కనపడుతోంది.హిట్ కోసం ఎదురుచూస్తున్న అల్లు శిరీష్ కి సొంత బ్యానర్ లో హిట్ దక్కేలా కనిపిస్తోంది.