అన్ని వున్నా అసలైంది లేదు రేజీనాకి

రెజీనా కసాండ్రా.. అందం, అభినయం రెండూ మెండుగా ఉన్న భామ. కానీ అసలైందే లేదు.. అదేనండీ.. అదృష్టం. పాపం.. పాపకు ఆవగింజంత అదృష్టం లేక స్టార్ హీరోయిన్ అనే పీఠానికి ఆమడ దూరంలోనే ఆగిపోయింది రెజీనా. ఎన్ని సినిమాల్లో నటించినా.. అన్నీ చిన్నవే కావడంతో చిన్నోళ్లకే పరిమితమైంది ఈ బ్యూటీ. మొదట్లో పద్దతిగా చీరకట్టులో కనిపించిన ఈ బ్యూటీ.. రారా కృష్ణయ్య నుంచి రూట్ మార్చేసింది. అవసరానికి తగ్గట్లు రంగులు మార్చేస్తుంది. ఆ మధ్య ఐఫా వేడుకల్లో హాలీవుడ్ హీరోయిన్ రేంజ్ లో అందాలు ఆరబోసింది రెజీనా. అయినా గానీ ఈ భామను ఎవ్వరూ పట్టించుకోవట్లేదు పాపం.

రెజీనాకు ఇప్పుడు అవకాశాల కొరత వచ్చేసింది. పెద్ద హీరోలు పట్టించుకోకపోయినా.. ఇన్నాళ్ళూ చిన్నోళ్లే ఈ భామకు అన్నీ అయ్యారు. కానీ ఇప్పుడు ఆ చిన్న హీరోలు కూడా రెజీనా వైపు చూడట్లేదు. మెగా హీరోలు కూడా రెజీనాను లైట్ తీసుకుంటున్నారు. ఎందుకో కావాలనే టాలీవుడ్ ఈ భామను పక్కన బెడుతుందా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. ప్రస్తుతం రెజీనా చేతిలో ఉన్న సినిమాలు రెండే.. అందులో ఒకటి శ్రీనివాస్ అవసరాల తెరకెక్కిస్తోన్న జ్యో అచ్చుతానంద.. మరోటి కృష్ణవంశీ-సందీప్ కిషన్ ల నక్షత్రం. ఈ రెండూ హిట్టైతే గానీ రెజీనాను మళ్లీ పట్టించుకునేలా లేరు మన హీరోలు. ఇప్పటికే అమ్మడు ఏజ్ 30కి వచ్చేసింది.. మరో ఏడాది ఆగితే ఎలాగూ షట్టర్ క్లోజ్. అందుకే ఇప్పట్నుంచే జాగ్రత్త పడుతోంది ఈ బ్యూటీ.

ఇదివరకు దర్శకనిర్మాతలు అడిగితే గానీ గ్లామర్ షో గురించి నోరు విప్పేది కాదు రెజీనా. కానీ ఇప్పుడు అడక్కపోయినా అందాల ఆరబోత గురించి మాట్లాడేస్తోంది ఈ బ్యూటీ. తాజాగా తాను బికినీకి కూడా రెడీ అనేసింది. కాకపోతే ఓ నెల ముందే తనకు చెప్పాలని షరతు పెడుతోంది. దీనికి కారణం లేకపోలేదు. ముప్పై రోజుల ముందు చెబితే కడుపు మాడ్చుకుని బికినీకి తగ్గట్లు తన బాడీని ప్రిపేర్ చేస్తానంటోంది రెజీనా. ప్రస్తుతం కఎష్ణవంశీ తెరకెక్కిస్తోన్న నక్షత్రంలో రెజీనా బికినీ వేస్తుందని సమాచారం.. మరి క్రియేటివ్ డైరెక్టర్ ఈ భామకు ఎన్ని రోజుల ముందు చెప్పాడో ఏమో..?