అనుష్క కోసమే ప్రభాస్‌

స్వీటీ బ్యూటీ అనుష్క ఒళ్లు తగ్గించే పనిలో బిజీగా ఉంది. ఇప్పటికింకా తన మునుపటి ఆకృతిని పొందలేకపోయినా చాలా వరకూ ఫిట్‌గా తయారయ్యిందంటున్నారు. ‘బాహుబలి ది కన్‌క్లూజన్‌’ సినిమాకి సంబంధించి షూటింగ్స్‌లో కూడా పాల్గొంటోందట.బాహుబలి మొదటి పార్ట్‌లో అనుష్క పాత్ర చిన్నదే అయినప్పటికీ, రెండో పార్ట్‌లో మాత్రం ఆమె పాత్రకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందట.

అంతేకాదు ఈ పార్ట్‌లో అనుష్క కత్తి యుద్ధాలు, గుర్రపు స్వారీలు కూడా చెయ్యాల్సి ఉందట. అందుకోసం అనుష్కకి ఫిట్‌నెస్‌ అవసరం. ఈ యోగా బ్యూటీ చేతిలో ఈ బిగ్‌ ప్రాజెక్ట్‌ ‘బాహుబలి’ ఒక్కటే కాదు మరో హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ మూవీ ‘భాగ్‌మతి’ కూడా ఉంది. ఈ సినిమాలో అనుష్క కోసం ప్రభాస్‌ ఒక గెస్ట్‌ రోల్‌లో కనిపించనున్నాడట. ‘బాహుబలి’ సినిమా నిమిత్తం వీరిద్దరి ప్రయాణం చాలా కాలంగా కొనసాగుతోంది. మామూలుగానే అనుష్కని అభిమానించని వారు ఉండరు ఇండస్ట్రీలో.

ఇక కలిసి ప్రయాణం చేస్తే అనుష్కని అస్సలు వదలలేరు ఎవరైనా. అందుకే ‘బాహుబలి’ సినిమా తరువాత అనుష్క చేయబోయే సినిమా అయిన ‘భాగ్‌మతి’కి కూడా ప్రబాస్‌ తన సపోర్ట్‌ని ఇవ్వాలని అనుకుంటున్నాడట. ఈ గెస్ట్‌ రోల్‌ ఈ సినిమాకి కీలకం కానుందట కూడా. అశోక్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా తెలుగుతో పాటు తమిళంలో కూడా విడుదల కానుంది.