అనుష్క రామ్ చరణ్ అసలు కథ ఇదీ

రామ్‌చరణ్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. సైంటిఫిక్‌ ఫిక్షన్‌ కథాంశంతో ఈ చిత్రం రూపొందనుందనే టాక్‌ వినవస్తుండగా, సబ్జెక్ట్‌ విషయంలో చరణ్‌ – సుకుమార్‌ ఇంకా చర్చోపచర్చల దశలోనే ఉన్నారని సమాచారమ్‌. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా రామ్‌చరణ్‌, బాలీవుడ్‌ బ్యూటీ అనుష్క పేరుని ప్రతిపాదించాడట. సుకుమార్‌ కూడా అనుష్క పట్ల సానుకూలంగానే ఉన్నప్పటికీ, రెమ్యునరేషన్‌ యాంగిల్‌లో చూస్తే కష్టమేనని అనుకుంటున్నారు. అనుష్క హీరోయిన్‌ అయితే సినిమాకి బాలీవుడ్‌లోనూ మంచి బిజినెస్‌ అయ్యే అవకాశం ఉందని ఆలోచిస్తున్నారట చరణ్‌ – సుకుమార్‌.

ప్రియాంకా చోప్రాతో చరణ్‌ గతంలో ‘జంజీర్‌’ సినిమా చేశాడు. సో ఆ రకంగా బాలీవుడ్‌తో చరణ్‌కి బాలీవుడ్‌తో పరిచయం బాగానే ఉంది. అంతే కాదు డైరెక్టర్‌ సుకుమార్‌కి కూడా బాలీవుడ్‌ హీరోయిన్స్‌తో బాగా పరిచయాలు ఉన్నాయి. కనుక సుకుమార్‌ అడిగితే అనుష్క కాదనకపోవచ్చు. అదీ గాక ప్రస్తుతం బాలీవుడ్‌ హీరోయిన్ల దృష్టిని టాలీవుడ్‌ బాగా ఎట్రాక్ట్‌ చేస్తోంది. అవకాశం వస్తే టాలీవుడ్‌లో నటించడానికి సుముఖంగానే ఉంటున్నారు బాలీవుడ్‌ భామలు. టాలీవుడ్‌కి టాప్‌ స్టార్‌ అయిన మెగాపవర్‌స్టార్‌తో నటించే ఇలాంటి ఛాన్స్‌ వచ్చినందుకు అనుష్క దాన్ని సద్వినియోగం చేసుకుంటుందో, లేక వదులుకుంటుందో చూడాలి.