సీనియర్ హీరోస్ కి దడ పుట్టిస్తున్న మోహన్‌లాల్‌!!

సత్యరాజ్‌ మొదట్లో నటించిన తెలుగు సినిమాలు దెబ్బతిన్నాయి. యంగ్‌ హీరో ఉదయ్‌కిరణ్‌ నటించిన ఓ సినిమాలోనూ, గోపీచంద్‌తో మరో సినిమాలోనూ నటించిన సత్యరాజ్‌ ఫెయిల్యూర్స్‌ చూశాడు. ప్రభాస్‌తో నటించిన ‘మిర్చి’ సినిమా అతనికి బిగ్‌ సక్సెస్‌ని ఇచ్చింది . అక్కడినుంచి సత్యరాజ్‌కి డిమాండ్‌ పెరిగింది. తెలుగులో పెద్ద పెద్ద అవకాశాలు ముందుగా సత్యరాజ్‌ చేతికే దక్కుతున్నాయి. అందుకే రాజమౌళి సత్యరాజ్‌ను దృష్టిలో ఉంచుకునే ‘బాహుబలి’లో కట్టప్ప పాత్రను సృష్టించాడు. ఆ పాత్రలో సత్యరాజ్‌కు హీరో ప్రభాస్‌కు ధీటుగా పేరొచ్చింది.

అయితే ఇప్పుడు సత్యరాజ్‌కి మోహన్‌లాల్‌ చెక్‌ పెట్టేలా ఉన్నాడు. ‘జనతా గ్యారేజ్‌ సినిమా’లో కీలకపాత్రలో నటిస్తున్నాడు మెహన్‌లాల్‌. మోహన్‌లాల్‌ మలయాళ సూపర్‌ స్టార్‌. అయినా తెలుగులో ఛాన్సులు వెల్లువలా వస్తున్నాయి. ఆయన కూడా తెలుగులో అన్ని క్యారెక్టర్స్‌ను టేకప్‌ చేస్తాను అని హింట్‌ తెలుగు దర్శక, నిర్మాతలకు ఇవ్వడంతో హడావిడిగా ఆయన కోసం క్యారెక్టర్స్‌ రెఢీ చేసేసుకుంటున్నారు. ‘జనతా గ్యారేజ్‌’ సినిమా విడుదలకు ముందే ఆయన ఇంత క్రేజ్‌ సంపాదించుకున్నాడు. ఇక రిజల్ట్‌ పాజిటివ్‌ అయితే ఇంకేముంది ఇక సత్యరాజ్‌ అయినా, జగపతి బాబైనా ఇంకెవరైనా బలాదూర్‌ కాక మరింకేంటి. అందుకే ఇప్పుడిప్పుడే క్యారెక్టర్‌ ఆర్టిస్టులుగానూ, విలన్స్‌గానూ తెలుగులో తమ కెరీర్‌ స్టార్ట్‌ చేసిన సీనియర్‌ హీరోస్‌ అందరికీ దడ పట్టుకుందట. ఏమో చూద్దాం తెలుగులో మోహన్‌లాల్‌ సక్సెస్‌ ఎంత మాత్రమో చూడాలి మరి.