వెరైటీ డ్యాన్స్ తో ఇరగదీస్తున్న కబాలి!

రజనీకాంత్ సినిమా పేరు చెబితే చాలు అతని స్టైలిష్ డాన్సులు వెంటనే గుర్తుకొస్తాయి. మెజీషియన్ మ్యాజిక్ తో మెస్మరైజ్ చేస్తే ఈ సూపర్ స్టార్ స్టైల్స్, డాన్సులతో మ్యాజిక్ చేస్తాడు. లేటెస్ట్ మూవీ కబాలి లో కూడా రజనీ ఓ మ్యాజిక్ చేస్తున్నాడట. అందులో కూతు… అనే ఓ వెరైటీ డాన్స్ తో ఊపేస్తాడట. ఈ డాన్స్ కొన్ని సెక్లనే ఉంటుందట. కానీ సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు మాత్రం పండగే.

కూతు డాన్స్… ఓ ప్రాంతం వారు చేసే లోకల్ డాన్స్. రజనీకాంత్ కూడా అక్కడి స్థానికులతో కలిసి డాన్స్ చేస్తాడట. అయితే ఇటీవలే రిలీజ్ అయిన కబాలి మ్యూజిక్ ఆల్బమ్ లో మాత్రం ఈ డాన్స్ ప్రస్తావన లేదు. కబాలి రిలీజ్ డేట్ మాత్రం ఇంతవరకు క్లియర్ గా తెలీడం లేదు. వాయిదాలు పడుతూ వస్తోంది. అది కూడా పిక్చర్ కు ప్లస్ అవుతోంది. ఎందుకంటే కబాలి మీద మరింత హైప్ రావడానికి ఈ ఆలస్యం యాడ్ అవుతోందని కొందరు భావిస్తున్నారు.

రజనీ కాంత్ నటించే సినిమాల్లో అతను మూవీ స్టార్టయిన వెంటనే కనబడడు. కాస్త రన్‌ టైం తర్వాత స్పెషల్‌ అప్పియరెన్స్ ఇస్తాడు. మణిరత్నం తీసిన దళపతి, మరికొన్ని సినిమాల్లోను అలానే దర్శనమిచ్చాడు. ఇప్పుడు కబాలిలో కూడా …పిక్చర్ బిగిన్ అయిన 15 నిముషాల తర్వాత కనబడతాడు అని టాక్ . ఇది ఆడియెన్స్ లో క్యూరియాసిటీని పెంచుతుంది. రజనీకాంత్ మిగతా మూవీస్ మాదిరే కబాలీ మీద కూడా ఫ్యాన్స్ బిగ్‌ హోప్స్ పెట్టుకున్నారు.