విశాల్ వరలక్ష్మి మధ్యలో శరత్ కుమార్

నడిగర్ సంఘం నేతగా శరత్ కుమార్ వర్గం పై పోరాడి విజయం సాధించిన విశాల్ అటు రాజకీయాలు ఇటు సినిమాల్లో వరుస హిట్లతో మంచి ఊపుమీదున్నాడు.కాగా నడిగర్ సంఘం ఎన్నికల సమయంలో శరత్ కుమార్,విశాల్ ఇద్దరు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.అయితే శరత్ కుమార్ కూతురు వరలక్ష్మీ తో విశాల్ ప్రేమ వ్యవహారం గురించి కోలీవుడ్ ఎప్పటినుండో కోడై కూస్తోంది.దానిపై ఇన్నాళ్లు ఎవ్వరూ నోరు మెదపలేదు.

ఇక నడిగర్ ఎన్నికలతో శరత్ కుమార్,విశాల్ ల మధ్య దూరం అమాంతం పెరిగిపోయింది.దాంతో పాటే విశాల్ వరలక్ష్మిల ప్రేమ వ్యవహారం కూడా అటకెక్కిందనే అనుకున్నారు అంత.తాజాగా వీరిద్దరూ కలిసున్న ఫోటో ఒకటి విశాల్ ట్విట్టర్ లో పోస్ట్ చేసి ఈ ఫోటో నే మొత్తం చెప్తోంది అని(Dis pic says it all )బాంబ్ పేల్చాడు.

ఇదేదో తమిళ్ సినిమా స్టోరీ లా లేదూ.హీరో హీరోయిన్ ప్రేమలో పడటం ఆ తరువాత హీరో హీరోయిన్ తండ్రితో రాజకీయ విభేదాలు,పోరాటాలు చెయ్యటం.రీల్ లైఫ్ లో అయితే సాధారణంగా కూతురి ప్రేమకు కరిగిపోయి తండ్రి చివర్లో కూతుర్ని హీరోకిచ్చి కట్టబెట్టి కథని సుఖాంతం చేస్తాడనుకోండి.కానీ ఇది రియల్ లైఫ్.ఇక్కడ వీరి కథ ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి మరి.ఇక్కడ కొసమెరుపేంటంటే విశాల్ ఫొటో పోస్ట్ చేసిన సమయంలో శరత్ కుమార్ అస్వస్థతకు గురికావటం.