రజినీ రోబో 2.0 సెంచరీ కొట్టాడు..

స్టార్ డైరెక్టర్ శంకర్, సూపర్ స్టార్ రజనీకాంత్ కాంబినేషన్‌లో ఓ మూవీ పట్టాలెక్కనుంది అంటే.. ఆ మూవీపై ఏ రేంజ్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం రోబో చిత్రానికి సీక్వెల్‌గా 2.0 అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో హాలీవుడ్ రేంజ్‌లో ఈ మూవీని శంకర్ తెరకెక్కిస్తున్నాడు.

గత ఏడాది డిసెంబర్ 16న మెదలైన ఈ చిత్ర షూటింగ్ నేటితో వంద రోజులు పూర్తి చేసుకున్నట్టు శంకర్ తెలిపాడు. రెండు భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు, క్లైమాక్స్ పూర్తి చేసిన శంకర్ దాదాపు చిత్ర షూటింగ్ సగం పూర్తైనట్టు తెలియజేశాడు. నేటితో సరిగ్గా వందరోజులు పూర్తైన సందర్భంగా సినిమా విశేషాలు తెలియజేస్తూ ఓ ఫోటో కూడా పోస్ట్ చేశాడు. అక్షయ్ కుమార్, అమీ జాక్సన్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రానికి ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తుంది చిత్ర యూనిట్ .