మెగా 150 హీరోయిన్ గా జేజమ్మ!

ఈమధ్య సీనియర్ హీరోలకు వారి ఏజ్ కు తగ్గ హీరోయిన్స్ దొరకడం కష్టంగానే ఉంది. ఎవరో ఒకరిని సెలెక్ట్ చేయడం కాదు పాయింట్. ఆ హీరోయిన్ రేంజ్ కూడా హీరో స్థాయిలో ఉండాలి. పైగా నటించే స్టామినా కూడా ఉండాలి. ఈ క్వాలిఫికేషన్స్ ఉన్న హీరోయిన్స్ దొరికినా డేట్స్ దొరకని సమస్య ఒకటి వెంటాడుతోంది. కొన్ని రోజుల కిందటి వరకు మరో సీనియర్ హీరో బాలకృష్ణ ఫేస్ చేసిన ఈ సమస్య ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి సినిమాకూ ఎదురైంది.

ఎంతో కాలం నుంచి ఎదురుచూసిన చిరంజీవి 150వ సినిమా షూటింగ్ వెరీ రీసెంట్ గా స్టార్టయింది. సినిమా ప్రారంభమైనందుకు చిరు కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు. అయితే ఇంతవరకు హీరోయిన్ సెలెక్షన్ కాలేదు. బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే ను తీసుకుందామని మెగా క్యాంప్ అనుకుంది. కానీ…దీపిక రెమ్యునరేషన్ ఎక్కువగా అడగడంతో ఆ ప్రపోజల్ ను డ్రాప్ చేసుకున్నారు.

ఇప్పుడు వరస హిట్స్ కొడుతున్న హీరోయిన్ ఎవరంటే…అనుష్క అనే చెప్పాలి. ఇలా ఆలోచించిన మెగా యూనిట్ అనుష్క అయితే కరెక్ట్ సెలెక్షన్ అనుకుందట. కానీ ఆ అమ్మడు ప్రస్తుతం బాహుబలి-2 , సింగం 3 ప్రాజెక్టులతో బిజీగా ఉంది. అవి కంప్లీట్ అయిన వెంటనే ప్రభాస్ ఫ్రెండ్ బ్యానర్ యువీ క్రియేషన్స్ పై తీసే భాగమతి కి డేట్స్ ఇచ్చింది అనుష్క. మరి ఇంత బిజీ ఉన్న భామని ఒప్పించడం ఎలా అని కత్తిలాంటోడు నిర్మాత రామ్ చరణ్ ఒక ప్లాన్ వేసినట్టు తెలిసింది.

రామ్ చరణ్.. తన ఫ్రెండ్ ప్రభాస్ ద్వారా భాగమతి నిర్మాతలను ఒప్పించి.. అనుష్క డేట్స్ ని అటు భాగమతికి, ఇటు కత్తిలాంటోడు కు సర్దుబాటు చేసేలా చూడమని అడగాలనుకుంటున్నట్టు ఒక టాక్ వచ్చింది. ఒకవేళ ఈ ప్రయత్నం సక్సెస్ అయితే చిరు సినిమాకు హీరోయిన్ ప్రాబ్లెం తీరినట్టే అని భావిస్తున్నారు.