మెగా హీరోయిన్‌ కన్‌ఫామ్‌ అయ్యిందా? 

మెగాస్టార్‌ చిరంజీవి సరసన హీరోయిన్‌గా ఎవరు నటిస్తారు? అనే కన్‌ఫ్యూజన్‌ ఇంకా కొనసాగుతోంది. అయితే ప్రస్తుతానికి ఒకరు కాదు, ఇద్దరు హీరోయిన్లు చిరంజీవికి జంటగా నటిస్తారనే క్లారిటీ అయితే వచ్చింది. చాలా కొద్ది రోజుల్లోనే సినిమా సెట్స్‌ మీదకు వెళ్ళిపోతోంది. కానీ హీరోయిన్స్‌ ఎవరన్నదీ మాత్రం సస్పెన్స్‌గా ఉంచుతున్నారు. త్రిష, నయనతార, శ్రియ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. సినిమా సెట్స్‌ మీదకు వెళ్ళనున్న విషయాన్ని నిర్మాత రామ్‌చరణ్‌ కన్‌ఫామ్‌ చేశాడు. నిర్మాతగా తొలి సినిమా కోసం ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నాడు చరణ్‌.

తొలిసారిగా నిర్మాణం చేపట్టిన చరణ్‌కి ఈ సినిమా చాలా ప్రత్యేకం. తొలిసారిగా నిర్మాత అవ్వడమే కాకుండా, తన తండ్రి మెగాస్టార్‌ చిరంజీవి సినిమానే తాను నిర్మించాలనుకోవడం మరింత విశేషం. అలాగే, ఇంకో పక్క చిరంజీవి రీ-ఎంట్రీ సినిమా కోసం ఎప్పుడెప్పుడా అని ఈగర్‌గా అభిమానులు ఎదురుచూస్తున్నారు. చిరంజీవి ఈ సినిమాలో రెండు గెటప్స్‌తో కనిపించనున్నారన్న విషయం వెలుగులోకి వచ్చింది. క్లాస్‌, మాస్‌ గెటప్స్‌ అని తెలుస్తోంది. డాన్సులు అయితే ఇరగదీసెయ్యనున్నారు. వినాయక్‌ దర్శకత్వంలో తెరకెక్కబోతోన్న ఈ సినిమాకు టైటిల్‌ ‘కత్తి లాంటోడు’ అనే పేరు పరిశీలనలో ఉంది. కానీ ఇంకా కన్‌పామ్‌ కాలేదు. కొణిదెల ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై రూపొందుతోన్న ఈ సినిమాలో యాక్షన్‌ సీన్స్‌ అదరహో అన్పించేలా ఉంటాయట.