తమన్నా ప్లాప్ ఫిలాసఫీ

జూనియర్ మాధురి దీక్షిత్ గా మిల్కీ బ్యూటీ తమన్నాను అడపాదడపా పేర్కొంటారు. అందం-అభినయం కలబోత ఈ పాలనురుగు సుందరి. టాలీవుడ్-కోలీవుడ్ ల్లో స్టార్డమ్ ఎంజాయ్ చేసిన తమన్నా.. బాలీవుడ్ లోనూ లక్ పరీక్షించుకుంది. కానీ ఆశించిన స్థాయిలో అమ్మడు సక్సెస్ కాలేదు. ఆమె నటించిన సినిమాలు ఫ్లాప్ జాబితాలో పడ్డాయి. ఇదే విషయమై ఎదురైన ప్రశ్నకు వేదాంత ధోరణిలో బదులిచ్చింది ఈ ముద్దుగుమ్మ. విజయాలు-వైఫల్యాలు మన చేతుల్లో లేవు కదా అంటూ వ్యాఖ్యానింది.

ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నారు పెద్దలు. కానీ తమన్నా రచ్చ గెలిచి ఇంట గెలవాలనుకుంది. ఈ ఉత్సాహంతో బాలీవుడ్ లో అడుగెట్టింది. అయితే ఫలితం మాత్రం తారుమారైంది. సౌత్ లో వెలిగినట్లు బాలీవుడ్ లో ఎంతోకొంత ప్రభావం చూపలనుకున్నా వీలవలేదు. దీనిపై మాట్లాడుతూ.. తన సినిమాల్లో పెద్ద సక్సెస్ లతో పాటూ ఫెయిల్యూర్స్‌ కూడా ఉన్నాయని వివరించింది. హిట్లు-ఫ్లాప్‌లు సమంగానే స్వీకరించానని చెప్పింది. హిట్ అవుతుందనే నమ్మకంతోనే ఓ సినిమాను ఒప్పుకుంటామని.. ఫెయిల్ అయినంత మాత్రాన దానిని నుంచి తప్పించుకోనని తెలిపింది. ఏదైనా నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటానని అంది.

వరుస పరాజయాలు వెన్నాడుతున్న క్రమంలో రాజమౌళి తనకు బాహుబలిలో ఛాన్స్ ఇచ్చినట్లు తమన్నాతెలిపింది. ఆ అవకాశమే తాను మళ్లీ పుంజుకునేందుకు దోహదం చేసిందని చెప్పింది.