జార్జియాలో ‘శాతకర్ణి’ పోరాటం!

‘గౌతమీపుత్ర శాతకర్ణి’ టైటిలే చాలా గంభీరంగా ఉంది. ఇక హీరో బాలయ్య లుక్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనేలేదు. ఇటీవలే విడుదల పోస్టర్ ఆయన అభిమానలోకాన్నే కాక సినీప్రియులు, విమర్శకులను ఆకట్టుకుంది. మొరాకోలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ కోసం డైరక్టర్ క్రిష్ పడుతున్న తపన అంతాఇంతా కాదు. ఈ సినిమా తాజా షెడ్యూల్ ను జార్జియాలో ప్లాన్ చేశారు. జులై 2 నుంచి 22 రోజులు భారీ యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించాలని అనుకుంటున్నారు. ఈ షెడ్యూల్ లో బాలకృష్ణ తదితరులు పాల్గొంటారు. జార్జియాలో షూట్ చేసే దృశ్యాలు క్లైమాక్స్ సీన్స్ అని వినికిడి.

‘గౌతమీపుత్ర శాతకర్ణి’కి సంబంధించి ‘మొరాకో’లోను .. హైదరాబాద్ లోను జరిపిన షూటింగులో కొన్ని యుద్ధ సన్నివేశాలు చిత్రీకరించారు. జార్జియాలోను పోరాట సన్నివేశాలను షూట్ చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం భారీ సంఖ్యలో జూనియర్ ఆర్టిస్టులనే కాక గుర్రాలనూ ఉపయోగిస్తున్నట్టుగా సమాచారం. ఈ చిత్రానికి ఈ పోరాట దృశ్యాలే హైలైట్ అని అంటున్నారు. బాలకృష్ణ సరసన శ్రియ నటిస్తోన్న ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.