‘జనతా గ్యారేజ్’ టీజర్ వచ్చేస్తోంది..

‘శ్రీమంతుడు’తో దర్శకుడిగా కొరటాల శివ, ‘నాన్నకు ప్రేమతో’తో హీరోగా జూనియర్ ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు. వీరి కాంబినేషన్ లో వస్తున్న ‘జనతా గ్యారేజ్’పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సినిమా షూటింగ్ పార్ట్ జూన్ నెలాఖరుతో పూర్తికానుంది. దీంతో.. ‘జనతా గ్యారేజ్’కు సంబంధించిన ఆడియో, టీజర్ రిలీజ్ కోసం అంతా ఎదురుచూస్తున్నారు. ఈ వెయింటింగ్ కు ముగింపు పలుకుతూ కొరటాల శివ లేటెస్ట్ గా ఓ ప్రకటన ఇచ్చారు. జులై 6న టీజర్ ను విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.

ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా అందరినీ ఉర్రూతలూగించేలా ‘జనతా గ్యారేజ్’ టీజర్ ను కట్ చేస్తున్నారు. ఇక ఆడియో వేడుకను అమెరికాతో పాటూ ఖమ్మంలోనూ నిర్వహిస్తారని వార్తలొస్తున్నాయి. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా ఆగస్టు 12న విడుదల చేయనున్నారు. ఎన్టీఆర్ సరసన సమంతా, నిత్యామీనన్ కథానాయికలుగా నటిస్తున్నారు.