జగన్ “దూకుడు”

వైసీపీ అధినేత, ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి స్పీడ్ పెంచుతున్నారు. నవ్యాంధ్ర రాజధాని ప్రాంతం విజయవాడలో పాగా వేసేందుకు సమాయత్తమయ్యారు. ఇప్పటి వరకు హైదరాబాద్ కేంద్రంగానే ఆయన రాజకీయ వ్యవహారాలు నడుపుతున్నారు. ఇక నుంచి విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా ఉండేందుకు సిద్ధమవుతున్నారు. టీడీపీ అధికారం లోకి వచ్చి రెండేళ్లవుతున్న ఏ ఒక్క హామీని పూర్తిగా నెరవేర్చాలేదని, ప్రభుత్వ వైఫల్యాలు ప్రజలకు తెలియజేయలని నిర్ణ యించారు. వైసీపీ ఎమ్మెల్యేలందరితోపాటు ఈ సమావేశంలో చర్చించి భవిష్యత్ కార్యచరణ ప్రణాళికలపై పక్కా వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల ఎక్కువ సంఖ్యలో టీడీపీలోకి వైసీపీ ఎమ్మెల్యేలు వెళ్లిపోయారు. మిగి లిన ఎమ్మెల్యేలతో అందుబాటులో ఉంటూ పార్టీ కార్యకలాపాలు చురుగ్గా నిర్వ హించేందుకు జగన్ యోచిస్తున్నారు. త్వరలోనే విజయవాడలో పార్టీ కార్యా లయాన్ని కూడా ప్రారంభిస్తారని వైసీపీ నేతలు చెబుతున్నారు. కాపు రిజర్వేషన్ అంశం, తుని ఘటనలో అరెస్టులు తదితర అంశాలపై దీక్షకు దిగిన ముద్రగడ పద్మనాభం ప్రభుత్వానికి పక్కలో బళ్లెంలా తయారయ్యారు. ఇటువంటి పరిస్థితు లు వైసీపీ కలిసొచ్చే అంశాలు. రాజధాని ప్రాంతంలో తక్కువ ధరకు టీడీపీ నేతలు భూములు కొనుక్కున్నారని జగన్ ఆరోపిస్తున్నారు. ఇదే అంశాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రైతు, డ్వాక్రా రుణ మాఫీ, నిరుద్యో గులకు పింఛన్ తదితర హామీల అమలులో చంద్రబాబు విఫలమయ్యారని జగన్ ఆరోపిస్తున్నారు. ఇటువంటివి ప్రభుత్వ వైఫల్యాలుగా ఎంచి ప్రజలకు తెలియజేయాలని వైసీపీ అధినేత సిద్దమవుతున్నారు.

ఇటీవల జగన్ మీడియా ప్రసారాలు ఏపీలో నిలుపదల అయ్యాయి. అధికారపార్టీయే కక్ష కట్టి ఛానెల్ ప్రసారాలు నిలుపుదల చేసిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇటువంటి అంశాలు జనాల్లో సానుభూతిని తెప్పిస్తా యని. ముద్రగడ అంశ కూడా ప్రతిపక్షానికి బలం చేకూరుతుందని జగన్ భావిస్తున్నారు. ఇటువంటి పరిస్థి తులల్లోనే అధికార పార్టీపై విమర్శనాస్త్రాలు బలంగా సంధించడానికి జగన్ ప్రయత్నిస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలను కూడా వారి వారి నియోజకవర్గాలలో పర్యటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచిస్తున్నట్లు తెలుస్తోంది.