కొరటాల హీరోలకు అందడేమో!

ఇద్దరు పెద్ద హీరోలు, రెండు పెద్ద సినిమాలు, భారీ విజయాలు. అంతే ఆ డైరెక్టర్‌ దశ తిరిగిపోయింది. అంతవరకూ స్టోరీ రైటర్‌గా ఉన్న ఆయన ఇంకెవరో కాదు కొరటాల శివ. ప్రభాస్‌తో ఆయన చేసిన ‘మిర్చి’ ఘాటైన విజయం తెచ్చి పెట్టింది. సూపర్‌ స్టార్‌ మహేష్‌తో చేసిన ‘శ్రీమంతుడు’ సూపర్బ్‌ విజయాన్ని అందించింది. దాంతో కొరటాల రేంజ్‌ ఎక్కడికో వెళ్లిపోయింది. ఇప్పుడు ఆయన కోసం స్టార్‌ హీరోలు క్యూ కట్టేస్తున్నారు. సాదా సీదా హీరోలకెవ్వరికీ ఈ స్టార్‌ డైరెక్టర్‌ అస్సలు అందుబాటులో లేడట. ముగ్గురు పెద్ద నిర్మాతలు కొరటాల డేట్స్‌ తీసేసుకున్నారట. వారికి మినహా మిగతా హీరోలకీ చిక్కడంలేదట కొరటాల శివ. చాలా మంది హీరోలు ఆయనతో సినిమా చేయాలని ట్రై చేస్తున్నారు. ఇప్పటికే డేట్స్‌ తీసుకున్న ఆ నిర్మాతలు ఎవరితో సినిమాలు చేస్తారో, వారి చుట్టూ యంగ్‌ హీరోలు తిరుగుతున్నారట. ప్రస్తుతం ‘జనతా గ్యారేజ్‌’ సినిమాతో బిజీగా ఉన్నాడు కొరటాల. ఆ సినిమా తరువాత ఆయన ఎవరితో సినిమా చేస్తారన్న విషయం ఇంకా ఖరారు కాలేదు. కానీ మరో స్టార్‌ హీరోతోనే తన నెక్స్ట్‌ మూవీ ఉండబోతోందన్న విషయం అయితే స్పష్టమవుతోంది. ఇంతగా తన ఇమేజ్‌ పెరిగిపోయిన కొరటాల శివ ఇప్పుడు రెమ్యునరేషన్‌ విషయంలో బాగా డిమాండ్‌ చేస్తున్నాడన్న ప్రచారం కూడా నడుస్తోంది. దాదాపుగా 10 కోట్లకు పైనే ఆయన రెమ్యునరేషన్‌ అడుగుతున్నట్లు తెలుస్తోంది.