ఆ 12 మందితో కేసీర్ కి తలనొప్పే

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. పేరుకు మంత్రివర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సహా మొత్తం 18 మంది వున్నారు. ఇందులో నలుగురైదురు మినహా మిగిలిన వారు తమ విధులను సక్రమంగా నిర్వర్తించలేకపోతున్నారు. క్యాబినేట్‌లోని 18 మంది మంత్రుల్లో 12 మంది మంత్రుల తీరు మాత్రం ప్రశ్నార్థకంగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమ వుతున్నాయి. తమ శాఖలపై పట్టు సాధించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పదే పదే చెప్తున్న వారు మాత్రం తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేప థ్యంలో పలువురి మంత్రుల పనితీరుపై సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో అసంతృప్తిని వ్యక్తం చే స్తున్నట్లు సమాచారం.

ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కావస్తుంది. అయినా మంత్రుల మాత్రం తమ శాఖలపై పట్టు సాధించలేదు. దీంతో శాఖలపై అధికారు లతో సమీక్షించేందుకు సైతం మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలు శాఖలపై ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న మంత్రులు కేటీఆర్‌తో పాటు హరీష్‌రావు కల్పించు కునే పరిస్థితి ఏర్పడుతోంది. అంతంత మాత్రం అవగాహన కలిగిన ఈ మంత్రుల తీరుతో సీఎం కేసీఆర్ తీవ్రంగా వేదనకు గురవుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు పలు కారణాలున్నా… సీఎం కేసీ ఆర్ నిత్యం అన్ని శాఖలపై తానే స్వయంగా సమీక్ష నిర్వహిస్తూ అధికారుల పనితీరును ఎప్పటికప్పుడూ పర్యవేక్షించడం వల్ల మంత్రుల తమ బాధ్యతను కొంత వరకు తప్పుకుం టున్నారనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావుతో పాటు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, ఐటీశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామరావులు తమ శాఖ లపై పూర్తిస్థాయిలో పట్టును సాధించారు. పైగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మి షన్ కాకతీయతో పాటు మిషన్ భగీరథ, సాగునీటి ప్రాజెక్టులు, ఇంటింటికి నల్లా కనెక్షన్ వంటి పథకాలు సైతం ఈ శాఖల పరిధిలోనే వున్నాయి. పైగా వీరు సీఎం కేసీఆర్ కుడి, ఎడమ భుజాలుగా ఉన్నారు.  పైగా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పలు పథకాలు, ప్రాజెక్టులపై నిత్యం వీరు సమీక్షలు నిర్వహిస్తూ క్షేత్రస్థాయిలోనూ పనుల నిర్వహణపై దృష్టి సారిస్తున్నారు. వీరితో పాటు ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి, రోడ్లు భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పా టు వాణిజ్యపన్నులశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌లు సైతం తమ పనితీరును మెరుగు పర్చుకుంటున్నారు.

 ఇటు పార్టీని అటు ప్రభుత్వా న్ని ఒంటిచెత్తే నడపడం ముఖ్యమంత్రికి కత్తి మీద సాములాంటిదే అయినా… తప్పనిసరి పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ పూర్తిస్థాయిలో దృష్టి సారిస్తున్నారు. లేకపోతే ప్రజల్లో చులకభావం ఏర్పడుతుందని ముఖ్యమంత్రి భావిస్తున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఇటీవల మంత్రివర్గ పునవ్యవస్థీకరించాలని భావిస్తున్నారు. పలువురు మంత్రుల శాఖలను మార్చడంతో పాటు పలువురిని ఉద్వాసన పలికి కొత్త వారిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని భావిస్తున్నారు. సీఎం కేసీఆర్ చేస్తున్న ఈ ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో వేచి చూడాల్సిందే..!