ఆసక్తిని రేపుతున్న పవన్ త్రివిక్రమ్ దాసరి టైటిల్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సంబంధించి ఏ చిన్న సమాచారం అయినా ఒక్క ఫిల్మ్ నగర్ లోనే కాదు మొత్తం సినీ,రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతుంది.ఇక పవన్ కొత్త సినిమా కబుర్ల గురించి అయితే పుకార్లు షికార్లు చేస్తూనే ఉంటాయి.ఇప్పటికే పవన్ తో ఖుషి డైరెక్టర్ సూర్య ఓ సినిమా సెట్స్ మీద వున్న విషయం తెలిసిందే.ఆ సినిమాకి తొలుత హుషారు అని టైటిల్ నిర్ణయించగా తరువాత నిర్మాత శరత్ మరార్ “కడప కింగ్ “అనే టైటిల్ ను ఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్టర్ చేయడం తో అదే పవన్ తదుపరి సినిమా టైటిల్ అన్న ప్రచారం సాగుతోంది.

ఇక తాజాగా పవన్,త్రివిక్రమ్ కంబినేషన్ లో ఒక సినిమా రాబోతోంది.దీనిపై అప్పుడే అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి.వీరిది బ్లాక్ బస్టర్ జోడి.సినిమాల పరంగానే కాక వ్యక్తిగతంగా కూడా వీళ్లిద్దరికీ మంచి స్నేహం ఉంది దానికి తోడు ఇద్దరి ఆలోచనల్లో సారూప్యత ఉండటమే వేళ్ళ విజయ రహస్యమనిపిస్తుంది.అలాంటి వీరిద్దరితో దర్శకరత్న దాసరినారాయణరావు ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే.మొత్తానికి ముగ్గురు ముగ్గురే.అలాంటి కేజ్రీ కాంబినేషన్ లో వస్తోన్న మూవీ టైటిల్ ఏంటని అందరూ చర్చించుకుంటున్నారు.ఇదే విషయమై తాజాగా ఫిల్మ్ నగర్ లో ఓ వార్త హల్చల్ చేస్తోంది.ఈ సినిమాకి “దేవుడే దిగివచ్చినా” అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు సమాచారం.త్రివిక్రమ్ కి చాలా దగ్గరి వాళ్ళు ఈ టైటిల్ ని ఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్టర్ చేయడం ఈ వార్తకి మరింత బలాన్ని చేకూరుస్తోంది.