అమెరికాలో నాని నితిన్ లకు అంత మార్కెట్ ఉందా!

ఈ మధ్య ఏ తెలుగు సినిమా మొదలుపెట్టినా US మార్కెట్ ని దృష్టిలో ఉంచుకుని సినిమాని తెరకెక్కిస్తున్నారు దర్శక నిర్మాతలు.దానికి తగ్గట్టుగానే అక్కడ తెలుగు సినిమాలకి కలెక్షన్స్ పంట పండుతోంది.ఆమద్యన బాహుబలి కలెక్షన్స్ సునామి సృష్టిస్తే ఆ తరువాత వచ్చిన శ్రీమంతుడు ఆ పరంపరని కొనసాగించింది. తాజాగా యూఎస్ బాక్సాఫీస్ దగ్గర తెలుగు సినిమాల జోరు తగ్గలేదు అని ఆ రెండు సినిమాలు మళ్ళీ నిరూపించాయి.. ‘అ ఆ’ .. ‘జెంటిల్ మన్’ చిత్రాలు సత్తా చాటుతున్నాయి. నితిన్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘అ ఆ’ సినిమా ఈ నెల 2న విడుదలై, ఇప్పటికీ అక్కడ వసూళ్ల వర్షం కురిపిస్తూనే ఉంది. ఇంతవరకూ ఈ సినిమా రూ.16.46 కోట్ల రూపాయలను రాబట్టి, బాహుబలి .. శ్రీమంతుడు తరువాతి స్థానాన్ని దక్కించుకుంది.

లేటెస్ట్ థ్రిల్లర్.. నాని హీరోగా రిలీజైన ‘జెంటిల్ మన్’ చిత్రం కూడా యూఎస్ లో దూకుడు చూపిస్తోంది. రెండవ వారాంతం పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.5.25 కోట్ల రూపాయలు రాబట్టింది. ఈ వారం పోటీకి వచ్చే పెద్ద సినిమాలేవీ లేకపోవడం ‘జెంటిల్ మన్’కు మరింత కలిసొచ్చే అంశం. దీంతో ఈ సినిమాకు వసూళ్లు పెరిగే అవకాశం ఉంది. మొత్తానికి ఈ నెలలో నితిన్ .. నాని సినిమాలు అమెరికా బాక్సాఫీస్‌ వద్ద ఓ వెలుగు వెలిగిపోతున్నాయి.