ప్లీనరీ ముగిసింది. ఎక్కడివారు అక్కడ సర్దుకున్నారు. ఇదీ.. ఇప్పుడు వైసీపీ నేతలు చేస్తున్న పని. ఏ పని అప్పగించినా.. పార్టీలోచిత్రమైన చర్చ సాగుతోంది. అంతా మొక్కుబడిగా సాగుతోందని.. మనసు పెట్టి చేయడం లేదని.. నాయకులు అంటున్నారు. ఇది వాస్తవమేనని.. తాజా పరిణామాలు చాటి చెబుతున్నా యి. ప్లీనరీకి ముందు మినీ ప్లీనరీలు నిర్వహించారు. దీనికి ముందు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే.. వాస్తవానికి ఇవన్నీ కూడా పార్టీ అధినేత జగన్ ఒత్తిడి మేరకు […]
Tag: ysrcp
సజ్జల సైడయ్యారా.. సైడ్ చేశారా….? వైసీపీలో గుసగుస
వైసీపీ కీలక నాయకుడు, ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు.. సజ్జల రామకృష్నారెడ్డి గురించి అందరి కీ తెలిసిందే. ముఖ్యమంత్రి జగన్ తర్వాత.. ముఖ్యమంత్రిగా ఆయనే చక్రం తిప్పుతున్నారని.. కొన్నాళ్లుగా వైసీపీలోనే చర్చ నడిచింది. ఎవరికి ఏ సమస్య వచ్చినా.. ఆయన దగ్గరకు వెళ్లడం.. ఆయన పరిష్కరించ డం.. ఎక్కడ ఏ మంత్రి దూకుడు ప్రదర్శించినా.. కంట్రోల్ చేయడం.. ఇలా.. అనేక రూపాల్లో సజ్జల ప్రాధా న్యం అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా కీలక విషయాల్లో మంత్రులు చేయాల్సిన […]
వైసీపీ నుంచి ఒక్కరే.. టీడీపీ నుంచి నలుగురు.. బాబుకు టెస్టే..!
సాధారణంగా.. ఏ పార్టీలో అయినా..టికెట్ల కోసం పోటీ పడుతున్న వారు ఎక్కువగానే ఉన్నారు. ఒక టికెట్ కు ఇద్దరు ఎప్పుడూ.. పోటీ ఉంటారు. పార్టీ ఏదైనా..టికెట్ కోసం.. ఆశపడుతున్నవారు సహజంగానే పెరు గుతున్నారు. అయితే.. ఒకే ఒక్క సీటు కోసం.. టీడీపీలో మరింత పోటీ పెరిగింది. ఒక్క సీటు కోసం నలుగురు పోటీ పడుతున్నారు. వచ్చే 2024 ఎన్నికల్లో టికెట్‌ను తమకంటే.. తమకే ఇవ్వాలని..వారు కోరుతున్నారు. దీంతో టీడీపీ అధినేతకు ఈ టికెట్ పరీక్షగా మారింది. మరోవైపు […]
ఎమ్మెల్యేలను అడ్డంగా ఇరికించేసిన జగన్..!
ఔను! తప్పు నాది కాదు..ఎమ్మెల్యేలదే!- అని కుండబద్దలు కొట్టేశారు.. వైసీపీ అధినేత జగన్. స్వయంగా తాను ఈ విషయాన్ని వెల్లడించకపోయినా.. మాజీ మంత్రులు.. నాయకులతో ఆయన తన మాటగానే చెప్పించారు. దీంతో ఇప్పటి వరకు “మా ఎమ్మెల్యే తప్పులేదు!“ అని అనుకున్న వారు కూడా ఇప్పుడు ఎమ్మెల్యేను అనుమానంగా చూడాల్సిన పరిస్థితి వచ్చిందనే టాక్ వినిపిస్తోంది. ఇది ఆశించిన పరిణామం కాదని, క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యే మరింత బలహీనం అవుతారని అంటున్నారు పరిశీలకులు. ఏం జరిగిందంటే.. గత 2019 […]
రాజంపేట నుంచి జగన్ పోటీ.. మారుతున్న వ్యూహాలు..!
మార్పు సహజం. రాజకీయాలు అయితే మరింతగా మార్పులు చోటు చేసుకుంటాయి. ఇప్పుడు వైసీపీలో నూ ఇలాంటి మార్పులే వస్తున్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా తన సొంత గడ్డ కడపలో వైసీపీ వ్యూహాల ను మార్చేందుకు సీఎం జగన్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారని పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. వచ్చే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జగన్.. ఆ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని నిర్ణయించు కున్నారు. ఈ క్రమంలోనే తనకు ఉన్న సమస్యలను కూడా పరిష్కరించనున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం […]
వైసీపీలో మొక్కుబడి మంత్రులు… ఫొటోలకు ఫోజులు మాత్రమే..!
“అన్నా.. పార్టీ తిరిగి గెలవాలంటే.. మీరు ప్రజల్లో ఉండాలి. అందరూ కలిసి.. ప్రజలకు మన ప్రభుత్వ ప్రాధాన్యాలు వివరించండి!“ ఇదీ.. సీఎం జగన్ చెప్పిన మాట. అయితే.. దీనిని ఎంతమంది మంత్రులు… పాటిస్తున్నారు? ఎంతమంది ప్రజలతో మమేకం అవుతున్నారు? అనేది ప్రధాన సమస్యగా మారింది. పైగా.. మంత్రి నారాయణ స్వామి, గుమ్మనూరు జయరాం, బూడి ముత్యాలనాయుడు, చెల్లుబోయిన వేణు.. ఇలా 12 మంది వరకు మంత్రులు ఈ కార్యక్రమాన్ని సీరియస్‌గా తీసుకోవడం లేదు. ఎక్కడిక్కడ సమస్యలు వస్తున్నాయని.. […]
ఈ సారి టీడీపీ టిక్కెట్ కావాలంటే కొత్త రూల్ పాటించాల్సిందే !!
ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో టికెట్లు ఆశిస్తున్న వారికి పార్టీ అధిష్టానం పెడుతోన్న రూల్స్‌తో మైండ్ బ్లాక్ అయ్యేలా ఉంది. ఇప్పటి వరకు ఎక్కడా లేని కొత్త రూల్స్‌ను తెరమీదకు తెస్తున్నారు. ఎంత పెద్ద నేత అయినా.. ఎంత సీనియర్ నేత అయినా కూడా ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ కావాలంటే ముందు డబ్బు సంచులు ఉండాలట. ఈ విషయంలో ఏ మాత్రం రాజీపడే ప్రశక్తే లేదని చెప్పేస్తున్నారట పార్టీ పెద్దలు. వచ్చే ఎన్నికలు పార్టీకి.. ఇంకా […]
షాక్: జనసేన గూటికి ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు…!
ఏపీలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. అధికార వైసీపీలో పెను మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇందుకు ప్రధాన కారణం ఆ పార్టీలో బండి ఇప్పటికే ఓవర్ లోడ్ అయిపోయింది. ప్రస్తుతం పార్టీ స్ట్రాంగ్‌గా ఉండడంతో పాటు గత సాధారణ ఎన్నికల తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లోనూ .. ఉప ఎన్నికల్లోనూ తిరుగులేని భారీ విజయాలు నమోదు చేస్తోంది. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ల కోసం విపరీతమైన పోటీ నెలకొంది. మరోవైపు జగన్ కనీసం 60 – 70 […]
పవన్ చక్రం తిప్పుతున్నారా.. మారుతున్న పరిణామాలపై వైసీపీ డేగకన్ను..!
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఏపీకి వస్తున్నారు.. ఇది వైసీపీకి ఆనందకర పరిణామం. ఎందుకంటే.. ఆయన నోటి నుంచి ఇక్కడి ప్రభుత్వాన్ని పొగిడించుకునేందుకు ఇప్పటికే ఢిల్లీస్థాయిలో వైసీపీ నాయకులు చక్రం తిప్పారని తెలుస్తోంది. అయితే.. అదేసమయంలో బీజేపీ.. వైసీపీ ప్రధాన ప్రత్యర్థి పార్టీ టీడీపీకి చేరువ అవుతోంది. ఇది భారీ ఎత్తున వైసీపీని కలవరపెడుతున్న అంశం. ఎందుకంటే.. ఏది జరగకూడదని.. వైసీపీ భావించిందో అదే జరుగుతోందికాబట్టి!! వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగా గెలవాలంటే.. 2019 ఎన్నికల్లో జరిగినట్టుగా.. […]