జ‌గ‌న్ అగ్ని ప‌రీక్ష‌లో ఆ ఇద్ద‌రు సీనియ‌ర్లు గెలుస్తారా..!

రాజకీయంగా ద‌శాబ్దం పాటు ఓ వెలుగు వెలిగిన ఓ ఇద్ద‌రు సీనియ‌ర్లు ఇప్పుడు వైసీపీ అధినేత వైఎస్‌.జ‌గ‌న్ పెట్టిన అగ్నిప‌రీక్ష‌ను ఎదుర్కోనున్నారు. ఉత్త‌రాంధ్ర రాజ‌కీయాల్లో మాజీ మంత్రులు బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు ఇద్ద‌రూ ఓ వెలుగు వెలిగారు. ఈ ఇద్ద‌రు త‌ల‌పండిన రాజ‌కీయ నాయ‌కులు ప‌దేళ్ల పాటు తమ సొంత జిల్లాల్లో కనుచూపుతో శాసించారు.  మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్‌.రాజ‌శేఖ‌ర్‌రెడ్డి అండదండతో పదవులు పొందడమే కాకుండా ఆయ‌న అనుచ‌రులుగా తిరుగులేని పెత్త‌నం చెలాయించారు. ఆ త‌ర్వాత వీరిద్ద‌రు […]

వైసీపీలోకి మాజీ ఎంపీ… మంత్రికి అదిరిపోయే షాక్‌

ఏపీలో రాజ‌కీయం రంజుగా మారుతోంది. టీడీపీ నుంచి వైసీపీలోకి వైసీపీ నుంచి టీడీపీలోకి జంపింగ్‌లు జోరందుకుంటున్నాయి. తాజాగా ప్రకాశం జిల్లాలోని చీరాల, చిత్తూరు జిల్లాలోని పలమనేరుకు చెందిన పలువురు నేతలు వైసీపీ అధ్య‌క్షుడు వైఎస్‌.జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీలో చేరిపోయారు. ఇదిలా ఉంటే మాజీ ఎంపీ చిమ‌టా సాంబు కూడా వైసీపీలో చేరిపోయారు. ప్ర‌కాశం జిల్లా చీరాల వైసీపీ నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త ఎడం బాలాజీ ఆధ్వర్యంలో మాజీ ఎంపీ చిమటా సాంబుతోపాటు ప‌లువురు కీల‌క నాయ‌కులు వైసీపీలో చేరారు. వైసీపీలో […]

వైసీపీ నేత‌ల‌కు పీకే టీం టెన్ష‌న్

వైసీపీ నేత‌ల‌కు ప్ర‌శాంత్ కిషోర్‌ షాడో టీం భ‌యం ప‌ట్టుకుంది. నుంచున్నా.. కూర్చున్నా.. పార్టీ స‌మావేశాల‌కు వెళ్లినా.. ప్ర‌జ‌ల్లోకి వెళ్లినా.. షాడో టీం స‌భ్యులు వెన‌కే వ‌స్తుండటంతో వీరిలో టెన్ష‌న్ రోజురోజుకూ పెరుగుతోంది. మాట్లాడినా.. మాట్లాడ‌క పోయినా వీరు ప్ర‌తి విష‌యం నోట్ చేస్తుండ‌టంతో.. ఆందోళ‌న అధిక‌మ‌వుతోంద‌ట‌. వీళ్లు ఇప్పుడు ఏం రిపోర్టు ఇస్తారోన‌ని, ఇది ఎన్నిక‌ల్లో త‌మ‌కు టికెట్ రాకుండా ఎక్క‌డ అడ్డుప‌డుతుందోనని కంగారుప‌డుతున్నార‌ట‌. పార్టీ కార్య‌క్ర‌మాల‌న్నీ త‌మ క‌నుస‌న్న‌ల్లోనే జ‌రిగేలా చూస్తుండ‌టంతో నేత‌ల గుండెల్లో […]

ఆ మ‌ర‌క తొల‌గించేందుకు జ‌గ‌న్ పాట్లు..! ప‌నిచేస్తాయా?

ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా.. అన్న‌ట్టుగా జ‌గ‌న్ త‌న‌పై ప‌డ్డ క్రిస్టియ‌న్ అనే మ‌చ్చ‌ను పోగొట్టుకోవ‌డం కోసం నానా తిప్ప‌లు ప‌డుతున్నారు. అయితే, ఇదంత వ‌ర్క‌వుట్ అయ్యే విష‌యం కాద‌ని అంటున్నారు విశ్లేష‌కులు. నిజానికి జ‌గ‌న్ తండ్రి వైఎస్ ఎప్పుడూ తాను క్రిస్టియ‌న్ అని అనిపించుకునేలా ఎక్క‌డా ప్ర‌య‌త్నించ‌లేదు. అయితే, జ‌గ‌న్ మాత్రం మెడ‌లో క్రైస్త‌వ శిలువ‌ను ధ‌రించ‌డం, ఆయ‌న త‌ల్లి విజ‌య‌ల‌క్ష్మి ఏకంగా బైబిల్‌నే ప‌ట్టుకుని ప్ర‌సంగాలు చేయ‌డం, ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌డం, ఇక‌, జ‌గ‌న్ […]

ఎమ్మెల్యే సీటుపై ఇద్ద‌రు వైసీపీ ఎంపీల క‌న్ను..!

నంద్యాల‌, కాకినాడ ఉప ఎన్నిక‌ల త‌ర్వాత ఏపీలో విప‌క్ష వైసీపీ రాజకీయంలో కాస్త దూకుడు త‌గ్గింది. నంద్యాల ఉప ఎన్నిక‌కు ముందు వ‌ర‌కు దూకుడుగా ముందుకు వెళ్లిన వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధులు, నాయ‌కులు ఈ రెండు ఎన్నిక‌ల త‌ర్వాత డిఫెన్స్‌లో ప‌డ్డారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈ పార్టీ నుంచి పోటీ చేయాల‌ని అనుకుంటోన్న వారు సేఫ్ గేమ్ కోసం రెడీ అవుతున్నారు. ఈ క్ర‌మంలోనే తాము ప్ర‌స్తుతం ప్రాథినిత్యం వ‌హిస్తోన్న నియోజ‌క‌వ‌ర్గాలు త‌మ‌కు అనుకూలంగా కావ‌న్న నిర్ణ‌యానికి వ‌స్తే […]

టీడీపీ కంచుకోట‌లో వైసీపీకి ఊపొచ్చిందే

వ‌రుస వైఫ‌ల్యాల‌తో కునారిల్లుతున్న ఏపీ ప్ర‌తిప‌క్షం వైసీపీలో అనూహ్యంగా ఊపొచ్చింది. అధికార టీడీపీకి కంచుకోట‌గా ఉన్న ఉభ‌య గోదావ‌రి జిల్లాల నుంచి నేత‌లు ఇప్పుడు జ‌గ‌న్ చెంత‌కు చేరుతున్నారు. ఈ ప‌రిణామాన్ని అస‌లు వైసీపీ నేత‌లు ఎవ‌రూ ఊహించ‌లేదు. దీంతో వారు ఒక్క‌సారిగా ఇప్పుడు ఉబ్బి త‌బ్బిబ్బ‌వుతున్నారు. విష‌యంలోకి వెళ్తే.. తూర్పు, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల్లో టీడీపీ హ‌వా అంతా ఇంతా కాదు. వైసీపీ పెద్ద బ‌లంగా లేదు. మొన్న‌టికి మొన్న తూర్పోగోదావ‌రి జిల్లా కాకినాడ‌లో జ‌రిగిన […]

సీఎంగా బాబు – విప‌క్ష నేత‌గా జ‌గ‌న్‌: ఎవ‌రు బెస్ట్‌… ఎవ‌రు వేస్ట్‌

ఒకరు సీఎం, మ‌రొక‌రు విప‌క్ష నేత ఇద్ద‌రూ బ‌లంగా ఉన్న నేత‌లే. అయినా కూడా ఏపీకి ఏమీ సాధించ‌లేక‌పోతున్నార‌నే టాక్ వినిపిస్తోంది. సీఎంగా అనుభ‌వ‌మున్న చంద్ర‌బాబు, విప‌క్ష నేత‌గా యువ‌నేత జ‌గ‌న్‌లు ఈ రాష్ట్రానికి ఏదో చేస్తార‌ని ఆశ‌లు పెట్టుకున్న‌వారి ఆశలు ఇప్ప‌డు అడియాశ‌లే అవుతున్నాయి. విష‌యంలోకి వెళ్తే.. 2014 ఎన్నిక‌ల్లో హోరా హోరీ పోరు సాగింది. ఈ క్ర‌మంలో అంద‌రూ జ‌గ‌న్ సీఎం సీటు ఎక్క‌డం ఖాయ‌మ‌నే వార్త‌లు వ‌చ్చాయి. దీంతో చంద్ర‌బాబు నిద్ర‌లేని రాత్రులే […]

జ‌గ‌న్ న‌యా ప్లాన్‌కు సూప‌ర్ రెస్పాన్స్‌

వైసీపీ అధినేత‌, ఏపీలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌.. ఏపీ ప్ర‌జ‌ల‌కు చేరువ కావాల‌నుకుని వేసిన ప్లాన్ అదిరింద‌నే టాక్ వినిపిస్తోంది. 2014లో కొంచెంలో మిస్స‌యిపోయిన సీఎం పీఠాన్ని 2019లో ఎలాగైనా స‌రే కైవసం చేసుకోవాల‌ని జ‌గ‌న్ భావిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఉత్త‌రాది నుంచి ఎన్నిక‌ల స‌ల‌హాదారు ప్ర‌శాంత్ కిషోర్‌ను ఇంపోర్టు చేసుకుని మ‌రీ ఇప్ప‌టి నుంచే అప్ప‌టి ఎన్నిక‌ల‌పై దృష్టి పెట్టారు. ఈ క్ర‌మంలోనే పీకే ఇచ్చే స‌ల‌హాల‌ను తూ.చ‌. త‌ప్ప‌క పాటిస్తున్నారు. ఈ […]

జ‌గ‌న్ కోట‌లో టీడీపీ ఖుషీ.. రీజ‌న్ ఇదే!

క‌డ‌ప గ‌డ‌ప‌లో పాగా వేసేందుకు ఏపీ సీఎం చంద్ర‌బాబు, ఆయ‌న త‌న‌యుడు లోకేష్ చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఫలించాయా?  ప‌్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్‌ కంచుకోట బ‌ద్ద‌లు కొట్టేందుకు వ్యూహాత్మ‌కంగా తీసుకున్న నిర్ణ‌యాలు స‌త్ఫ‌లితాలు ఇస్తున్నాయా? ఇక కంచుకోట‌లో జ‌గ‌న్ పని అయిపోయిందా? అంటే అవున‌నే అంటున్నారు క‌డ‌ప టీడీపీ నేత‌లు! నంద్యాల‌, కాకినాడ ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత‌.. వైసీపీ గ్రాఫ్ ప‌డిపోతోందనే చ‌ర్చ రాష్ట్ర‌మంతా జ‌రుగుతోంది. వైసీపీ బ‌లంగా ఉన్న జిల్లాల్లో సైకిల్ దూసుకుపోతోంద‌ని స‌ర్వేల్లో కూడా స్ప‌ష్ట‌మ‌వుతోంది. […]