ఖమ్మంలో కారుకు ఆ ఇద్దరి దెబ్బ..రివర్స్.!

ఉమ్మడి ఖమ్మం జిల్లా అంటే అధికార బి‌ఆర్‌ఎస్ పార్టీకి పెద్దగా కలిసిరాని జిల్లా అని చెప్పవచ్చు. తెలంగాణలో మిగిలిన 9 ఉమ్మడి జిల్లాలు ఒక ఎత్తు అయితే..ఈ ఖమ్మం జిల్లా మరొక ఎత్తు. బి‌ఆర్‌ఎస్ పార్టీకి ఏ మాత్రం పట్టు లేని జిల్లా. 2014, 2018 ఎన్నికల్లో జిల్లాలో బి‌ఆర్‌ఎస్‌కు గట్టి దెబ్బ తగిలింది. అయితే 2018 ఎన్నికల్లో కాంగ్రెస్, టి‌డి‌పిల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలని బి‌ఆర్‌ఎస్ లోకి తీసుకున్నారు. అలాగే పలువురు కీలకమైన నేతలని బి‌ఆర్‌ఎస్ […]

తుమ్మలతో రేవంత్..హస్తం గూటికే..సీటుపైనే చర్చ.!

తెలంగాణ రాజకీయాల్లో సీనియర్ నాయకుడు..నాలుగు దశాబ్దాల నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలని శాసిస్తున్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పార్టీ మారడానికి చూస్తున్నారు. అధికార బి‌ఆర్‌ఎస్ పార్టీలో సీటు దక్కకపోవడంతో ఆయన హస్తం గూటికి చేరేందుకు రెడీ అవుతున్నారు. ఇంతకాలం పార్టీ మార్పుపై ప్రచారం జరిగిన అది ఆచరణ కాలేదు. కానీ ఇప్పుడు ఆచరణ అయ్యే దిశగా వెళుతుంది. తుమ్మలని తాజాగా రేవంత్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు కలిశారు. దీంతో తుమ్మల కాంగ్రెస్ […]

పట్నంకు మంత్రి.. తుమ్మల-తీగల పొజిషన్ ఏంటి?

మొత్తానికి ఎన్నికల షెడ్యూల్ రాకముందే అభ్యర్ధుల లిస్ట్ ప్రకటించి కే‌సి‌ఆర్ దూకుడు ప్రదర్శిస్తున్నారు. 119 సీట్లకు గాను..ఒక్కసారే 115 సీట్లలో అభ్యర్ధులని ప్రకటించారు. ఒక 9 చోట్ల సిట్టింగ్ సీట్లలో మినహా మిగతా సీట్లలో సిట్టింగులకు ఛాన్స్ ఇచ్చారు. అటు కాంగ్రెస్, ఎం‌ఐ‌ఎం, బి‌జే‌పి సిట్టింగ్ సీట్లలో బలమైన అభ్యర్ధులని ఫిక్స్ చేశారు. అయితే గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన 12 మంది, టి‌డి‌పి నుంచి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు బి‌ఆర్‌ఎస్ లోకి వచ్చిన విషయం […]

ఖ‌మ్మం జిల్లాలో ప‌డే కాషాయ పిడుగు ‘ తుమ్మ‌ల ‘ దేనా..!

తెలంగాణ‌లో క్ష‌ణంక్ష‌ణం ఉత్కంఠగా మారుతోన్న రాజ‌కీయాల ప్ర‌భావం ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాపై కూడా ప‌డింది. తాజాగా కాంగ్రెస్ మునుగోడు ఎమ్మెల్యే రాజ్‌గోపాల్ రెడ్డి పార్టీకి, ఎమ్మెల్యే ప‌ద‌వికి గుడ్ బై చెప్పేసి బీజేపీ పంచ‌న చేరిపోయారు. ఇక తెలంగాణ‌లో ఉమ్మ‌డి జిల్లాల ప‌రంగా చూస్తే బీజేపీకి న‌ల్ల‌గొండ‌, ఖ‌మ్మం జిల్లాల్లోనే స‌రైన ప‌ట్టులేదు. అలాంటి టైంలో కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డినే పార్టీలో చేర్చుకుని అక్క‌డ ప‌ట్టు పెంచుకుంటోంది. అలాగే రాజ్‌గోపాల్ రెడ్డి సోద‌రుడు భువ‌న‌గిరి […]