త్రివిక్ర‌మ్ వ‌ర్సెస్ కొర‌టాల‌..ఎన్టీఆర్ ఓటు ఎవ‌రికో?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న `ఆర్ఆర్ఆర్‌` చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఈ సినిమా త‌ర్వాత ఎన్టీఆర్ త‌న 30వ సినిమా ఏ డైరెక్ట‌ర్‌తో చేస్తాడ‌న్న‌ ఆస‌క్తి అంద‌రిలోనూ నెల‌కొంది. గ‌త కొంత కాలంగా మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్‌తో ఎన్టీఆర్ సినిమా ఉంటుంద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతున్న వేళ‌.. కొర‌టాల శివ పేరు తెర‌పైకి వ‌చ్చింది. ఎన్టీఆర్ త‌న త‌దుప‌రి సినిమా కొర‌టాల‌తోనే చేస్తాడ‌ని వార్త‌లు […]

‘వకీల్ సాబ్’ కొంపముంచిన ఐపీఎల్‌..ఏం జ‌రిగిందంటే?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ దాదాపు మూడేళ్ల గ్యాప్ త‌ర్వాత `వ‌కీల్ సాబ్‌` చిత్రంతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. వేణు శ్రీ‌రామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం బాలీవుడ్‌లో హిట్ అయిన `పింక్‌`కు రీమేక్‌. దిల్ రాజు, బోణీ క‌పూర్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 9న విడుద‌లై సూప‌ర్ టాక్‌తో దూసుకుపోతోంది. క‌లెక్ష‌న్స్ ప‌రంగా కూడా ఈ చిత్రం దుమ్ము దులిపేస్తోంది. ఇదిలా ఉంటే.. బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లు ఇలా ఏదో […]

మ‌హేష్ నో చెప్పిన ఆ సినిమాకు సోనూసూద్ గ్రీన్‌సిగ్నెల్‌?

అధికారికంగా ప్ర‌క‌టించి కూడా ప‌ట్టాలెక్క‌ని సినిమాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటిలో డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ `జనగణమన` ఒక‌టి. మొదట‌ ఈ చిత్రాన్ని సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుతో చేయాల‌ని పూరీ భావించారు. అఫిషియ‌ల్‌ అనౌన్స్‌మెంట్ కూడా చేశాడు. కానీ, వీరిద్దరి మధ్య విభేదాలు తొంగి చూడటంతో.. మ‌హేష్ ఈ సినిమా చేసేందుకు నో చెప్పాడు. దీంతో ఈ సినిమా మరుగున మడిపోయిందని అంతా అనుకున్నారు. కానీ, పూరీ మాత్రం ఇటీవ‌లె ‘జగనణమన […]

rrr

`ఆర్ఆర్ఆర్‌` నుంచి మ‌రో అదిరిపోయే అప్డేట్..‌?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం)‌`. ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో డీవీవీ దానయ్య భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా లెవ‌ల్‌లో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం చరణ్ సరసన బాలీవుడ్ భామ ఆలియా భట్, ఎన్టీఆర్ సరసన బ్రిటన్ మోడల్ ఒలివియా మోరిస్ నటిస్తున్నారు. ప్ర‌స్తుతం షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటున్న ఈ చిత్రం అక్టోబర్ 13న విడుదల కానుంది. […]

చిరు `లూసిఫర్` రీమేక్‌కు క్రేజీ టైటిల్‌..?

మెగా స్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో `ఆచార్య‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. షూటింగ్‌ను శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటున్న ఈ చిత్రం.. మే14న విడుద‌ల కానుంది. ఈ చిత్రం త‌ర్వాత చిరు `లూసిఫర్` రీమేక్ చేయ‌నున్నాడు. మలయాళంలో మోహన్‌లాల్ హీరోగా తెర‌కెక్కిన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. ఇప్పుడు ఇదే చిత్రాన్ని తెలుగులో ద‌ర్శ‌కుడు మోహన్‌రాజా తెర‌కెక్కించ‌బోతున్నారు. ఇటీవ‌లె ఈ సినిమా ప్రారంభం కాగా.. త్వ‌ర‌లోనే రెగ్యులర్ షూటింగ్‌కి రెడీ అవుతోంది. ఇదిలా ఉంటే.. […]

పవన్ ‘వకీల్ సాబ్’ మహేష్ ట్వీట్

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తాజా చిత్రం `వ‌కీల్ సాబ్‌`. వేణు శ్రీ‌రామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని శ్రీ‌వెంకటేశ్వరా క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై దిల్ రాజు, బోణీ క‌పూర్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం భారీ అంచ‌నాల న‌డుము ఏప్రిల్ 9న థియేటర్ల‌లో విడుద‌ల కాగా.. హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇక తాజాగా ఈ చిత్రాన్ని చూసిన సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప‌వ‌న్‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. వ‌కీల్ సాబ్ అద్భుతంగా ఉందని ప్రశంసించిన […]

విశ్వమిత్రుడి గెటప్‌లో ప్ర‌భాస్‌..నెట్టింట్లో రేర్ ఫొటో వైర‌ల్‌!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో `రాధే శ్యామ్‌` పూర్తి చేసిన ప్ర‌భాస్‌.. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో `స‌లార్‌`, ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో `ఆదిపురుష్‌` చిత్రాల‌ను సెట్స్ మీద‌కు తీసుకువెళ్లాడు. ప్ర‌స్తుతం ఈ రెండు చిత్రాల షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఇక ఇవి పూర్తి అయిన వెంట‌నే నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ భారీ బ‌డ్జెట్ సినిమా చేయ‌నున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ప్ర‌భాస్‌కు […]

త‌మ‌న్నా ధ‌రించిన ఆ డ్ర‌స్సు ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గ‌డం ఖాయం!

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `శ్రీ‌` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన త‌మ‌న్నా.. స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. కేవ‌లం తెలుగులోనే కాకుండా.. హిందీ, త‌మిళ భాష‌ల్లోనూ కూడా న‌టించి ఎంద‌రో అభిమానుల‌ను సంపాదించుకుంది. ఇక ప్ర‌స్తుతం గోపీచంద్ స‌ర‌స‌న `సీటీమార్‌`, వెంకీ-వ‌రుణ్ హీరోలుగా తెర‌కెక్కుతున్న‌ `ఎఫ్3`, సత్యదేవ్ స‌ర‌స‌న‌ `గుర్తుందా శీతాకాలం` చిత్రాల్లో త‌మ‌న్నా న‌టిస్తోంది. అలాగే ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో `లెవెంత్ అవర్` అనే వెబ్ సిరీస్‌లో […]

మ‌ళ్లీ విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న‌ `చావు కబురు చల్లగా`!

యంగ్ హీరో కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంట‌గా న‌టించిన చిత్రం `చావు కబురు చల్లగా`. కౌశిక్ పెగ‌ళ్లపాటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యాన‌ర్‌పై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించారు. భారీ అంచ‌నాల న‌డుమ మార్చి 19న విడుద‌లైన ఈ చిత్రం ఓ మోస్త‌రు టాక్ తెచ్చుకుంది. అయితే ఇప్పుడు ఈ చిత్రం మ‌ళ్లీ విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. లాక్ డౌన్ తర్వాత కూడా ఓటీటీలకు ఏ మాత్రం ఆదరణ […]