కర్నూలు జిల్లా టీడీపీలో రాజకీయం రసకందాయంగా మారింది. ముఖ్యంగా ఆళ్లగడ్డ. నంధ్యాల ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, అఖిలప్రియ వైసీపీని వీడి టీడీపీలో చేరిన నాటినుంచి జిల్లాలో రాజకీయాలు హీటెక్కాయి. వీరి రాకతో శిల్పా వర్గం, ఆళ్లగడ్డ టీడీపీ ఇన్‌చార్జి గంగుల ప్రభాకర్ రెడ్డి వర్గం కూడా తీవ్ర అసంతృప్తితో ఉంది. అయితే శిల్పా వర్గం పార్టీ మారే అలోచనతో ఉంటే.. ఇప్పుడు గంగుల వర్గం కూడా దాదాపు పార్టీ మారడం ఖాయమైపోయింది. ఇక రేపో మాపో అన్నట్లు […]
Tag: TDP
పన్నీర్ వెంట టీడీపీ.. శశికళ వెంట వైకాపా!
తమిళనాడు రాజకీయాల్లో సీఎం సీటు కేంద్రంగా రెండు రోజులుగా జరుగుతున్న వివాదం దేశం మొత్తాన్ని ఆకర్షించింది. పురుట్చితలైవి, అమ్మ జయలలిత హఠాన్మరణంతో ఖాళీ అయిన తమిళనాడు సీఎం సీటును ఆపద్ధర్మ సీఎంగా అమ్మకు అత్యంత విధేయుడు, ఆదర్శప్రాయుడు అయిన పన్నీర్ సెల్వం తమిళనాడుసీఎంగా బాధ్యతలు స్వీకరించారు. అయితే, ఈ సీటుపై కన్నేసిన శశికళ.. పన్నీర్‌తో రాజీనామా చేయించి అన్నాడీఎంకు ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. అంతేకాదు, రాష్ట్రంలో సీఎం అయ్యేందుకు తనకు అన్ని అర్హతలు ఉన్నాయని ప్రకటించుకున్నారు. […]
టీడీపీలో మొదలైన మంత్రి వర్గ విస్త`రణం`
ఏపీలో మంత్రి వర్గ విస్తరణ జరుగుతుందని వార్తలు జోరందుకున్న తరుణంలో.. వివిధ జిల్లాల్లో అసంతృప్తి సెగలు చెలరేగుతున్నాయి. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వారికి ఈసారి ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం చంద్రబాబు భావిస్తుండటంతో.. సీనియర్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కర్నూలుకు చెందిన భూమా నాగిరెడ్డి, తూర్పుగోదావరి జిల్లా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు కేబినెట్‌లో బెర్త్ ఖాయమని తెలుస్తున్న వేళ,, ఆ జిల్లాల్లో సీనియర్ నాయకులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ముఖ్యంగా ఆ నాయకులకు చెందిన ప్రత్యర్థులు.. పార్టీని వీడేందుకు […]
వైసీపీ ఎంపీతో టీడీపీ మంత్రి రహస్య మంతనాలు
మంత్రి వర్గ విస్తరణలో ఈసారి వేటు తప్పదు అని భావిస్తున్న వారిలో మంత్రి రావెల కిశోర్‌బాబు పేరు ప్రధానంగా వినిపిస్తోంది. కొంత కాలంనుంచి ఆయన వ్యవహార శైలి పార్టీకి తలనొప్పులు తెస్తున్న విషయం తెలిసిందే! ఇదే సమయంలో ఆయన అకస్మాత్తుగా అదృశ్యమవడం చర్చనీయాంశమైంది, దీనిపై విజిలెన్స్ కమిటీ సీఎంకు నివేదిక కూడా అందించింది. ఇందులో ఏముందో తెలిస్తే ఆశ్చర్యం కలగక మానదు! ఆ సమయంలో ఆయన వైసీపీ ఎంపీతో రహస్య మంతనాలు కొనసాగించారని తేలడంతో.. ఇప్పుడు రాజకీయాల్లో […]
బ్రేకింగ్: టీఆర్ఎస్ తో టీడీపీ పొత్తు
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారిపోయింది! రాష్ట్రం విడిపోయాక తీవ్రంగా నష్టపోయింది టీడీపీనే! అలాగే ఇప్పటికే మినీ తెలుగుదేశంలా టీఆర్ఎస్ మారిపోయిందనేది విశ్లేషకుల అభిప్రాయం. ఓటుకు నోటు వ్యవహారం బయటపడిన దగ్గర నుంచి టీఆర్ఎస్-టీడీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతలా పరిస్థితి మారిపోయింది, మరి ఉప్పు నిప్పు లాంటి పార్టీలు రెండూ కలిసి పనిచేస్తాయని కలలో కూడా ఊహించలేం కదా! కానీ ఇప్పుడు ఇలాంటి పరిణామాలు రాబోతున్నాయట! వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ – టీడీపీతో బీజేపీ […]
ఏపీలో ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేల రాజీనామా ?
కీలకమైన మంత్రి వర్గ విస్తరణకు రంగం సిద్ధమవుతున్న తరుణంలో.. ఉప ఎన్నికలకు టీడీపీ సిద్ధమవుతోంది! అందులోనూ ఈ ఎన్నికల్లో సేఫ్ గేమ్‌కు తెరతీస్తోంది. తమ పార్టీ నుంచి టీడీపీలో చేరిన వారితో రాజీనామా చేయించి.. ఉప ఎన్నికలను ఎదుర్కోవాలని.. వైసీపీ నాయకులు పదే పదే చేస్తున్న విమర్శలకు చెక్ పెట్టడంతో పాటు.. వీరి విజయంతో తమ పార్టీకి తిరుగులేదని నిరూపించవచ్చనే వ్యూహంతో బరిలోకి దిగాలని టీడీపీ నాయకత్వం భావిస్తోంది. వైకాపా నుంచి పార్టీలోకి చేరిన జంప్ జిలానీలతో […]
బాబు కేబినెట్ లో వీరు సేఫ్
ఏపీ సీఎం చంద్రబాబు తన కేబినెట్‌ను ప్రక్షాళన చేస్తారనే విషయం ఖాయమైపోయింది. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు కూడికలు, తీసివేతల్లో తలమునకలైపోయారు. ఈ క్రమంలో బాబు తన టీంలోని కొందరు మంత్రులను ఎలాంటి సంకోచం లేకుండా తీసి పక్కన పెడతారని టాక్ నడుస్తుండగా.. మరికొందరి విషయంలో మాత్రం ఎలాంటి ఆరోపణలు వచ్చినా.. ఎలాంటి మార్పూ ఉండబోదని అంటున్నారు టీడీపీ నేతలు. మరి ఈ విషయం ఏంటో తెలుసుకుందాం. ప్రస్తుతం బాబు కేబినెట్‌లో చాలా మంది మంత్రులపై ఆరోపణలు […]
కడపలో బాబుకు దిమ్మతిరిగే షాక్
ప్రతిపక్ష నేత జగన్ సొంత జిల్లా కడపలో ఎలాగైనా పట్టు సాధించాలని టీడీపీ అధినేత బలంగా నిశ్చయించుకున్నారు. ఇందులో భాగంగా ఆ పార్టీకి చెందిన కీలక నేతలను ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా తమ పార్టీలో చేర్చేసుకున్నారు. దీంతో రాజకీయంగా బలపడ్డామని టీడీపీ నేతలు సంబరపడిపోయారు. అయితే ఇప్పుడు ఆ ఆనందం ఎంతో కాలం నిలవడం లేదు! సంబరపడిన నేతలే అవాక్కవ్వబోతున్నారు! జగన్ సొంత ఇలాకాలో టీడీపీకి ఆ నేతలంతా షాక్ ఇవ్వబోతున్నారు! పచ్చ కండువా కప్పుకున్న నేతలు.. […]
పెటాకుల దిశగా టీడీపీ-బీజేపీ పొత్తు
మిత్రపక్షమైన టీడీపీతో ఎప్పుడెప్పుడు విడిపోదామా? అని బీజేపీ నేతలు ఎదురు చూస్తున్నారు! కలహాల కాపురం చేయలేమని చెబుతున్నా.. తప్పదు అన్న రీతిలో అధినాయకత్వం ఆదేశాలివ్వడంతో ఇక తప్పని పరిస్థితుల్లో కూటమిలో కొనసాగుతున్నారు! అయితే పెండింగ్‌లో ఉన్న మున్సిపల్-కార్పొరేషన్ ఎన్నికల్లో విడివిడిగా పోటీచేయనున్నాయా? ఇక టీడీపీ-బీజేపీ నేతలు ఎవరి దారి వారు చూసుకోబోతున్నారా? కలహాల కాపురానికి ఈ ఎన్నికలతో ఫుల్ స్టాప్ పెట్టి బరిలోకి దిగబోతున్నారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది! రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న మున్సిపల్ […]