కొత్తగా మంత్రి బాధ్యతలు స్వీకరించిన మంత్రులకు సరికొత్త సమస్యలు ఆహ్వానిస్తున్నాయి . వేరే పార్టీ నుంచి వచ్చి.. మంత్రి పదవులు పొందిన వారి జిల్లాల్లో వారికి ఎమ్మెల్యేల నుంచి ఏ మేరకు సహాయం అందుతుందోననే చర్చ ఇప్పుడు తీవ్రమైంది. ముఖ్యంగా విజయనగరం జిల్లాలో ఇప్పటికే ఇది నివురుగప్పిన నిప్పులా మారింది. ప్రస్తుతం ఇక్కడి నుంచి సుజయ కృష్ణ రంగారావు మంత్రి ఎంపికవగా.. ఆయన ముందు ఇప్పటికే అనేక సమస్యలు సవాలు విసురుతున్నాయి. గతంలో మృణాళిణి.. ఇప్పుడు కృష్ణకు […]
Tag: TDP
2019: టీడీపీ+బీజేపీ+జనసేన పొత్తు
సంచలన వ్యాఖ్యలకు మారుపేరైన మంత్రి అయ్యన్నపాత్రుడు.. మరోసారి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. 2019 ఎన్నికల్లో బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకుంటుందా ? జనసేన ఈసారి టీడీపీ-బీజేపీతో కలుస్తుందా? అనే సందేహాలు ఇప్పటివరకూ అందరిలోనూ ఉన్నాయి. వీటన్నింటికీ సమాధానం ఇస్తూ.. ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. 2019 ఎన్నికల్లో టీడీపీ,బీజేపీ, జనసేన కలిసి పోటీచేస్తాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరి జనసేనకు ఎన్ని సీట్లు కేటాయిస్తారు? పవన్ అడిగినన్ని సీట్లు టీడీపీ అధినేత చంద్రబాబు ఒప్పుకుంటారా? అనే ప్రశ్నలు […]
బాబుపై జోకులేసుకుంటున్న అధికారులు
`నేను నిద్రపోను.. మిమ్మల్ని నిద్రపోనివ్వను` ఇదీ క్లుప్తంగా సీఎం చంద్రబాబు థియరీ! 2014 ఎన్నికల సమయంలో `నేను మారాను` అన్నారు. `గతంలో చూసిన నేను వేరు.. ఇప్పుడు నేను వేరు` అని స్పీచ్‌లు ఇచ్చారు. `గతంలో చేసిన పొరపాట్లు మళ్లీ చేయను` అని హామీ ఇచ్చారు. అంతా నమ్మారు. కానీ సీన్ రివర్స్ అయింది. ఉద్యోగులు, అధికారులకు తిప్పలు రెట్టింపు అయ్యాయి. వారి కష్టాలు మళ్లీ మొదటికొచ్చాయి. నెమ్మదిగా చంద్రబాబు ఉపన్యాసాలకు అలవాటు పడిపోయిన వీరు ఇప్పుడు […]
క్రైసిస్‌లో టీడీపీ.. కారణాలు ఇవేనా..?
ఏపీ సీఎం చంద్రబాబు కుల సమీకరణాలు తప్పాయి! ప్రాంతాల వారీగా సమన్యాయం పాటించామని చెబుతున్న ఆయన లెక్కలు ఎక్కడో బెడిసికొట్టాయి! మంత్రి వర్గవిస్తరణలో నూటికి నూరు శాతం అన్ని వర్గాలకు న్యాయం చేశామని, లెక్కలన్నీ పాటించానని ఆయన బల్ల గుద్ది మరీ చెబుతున్నా.. పార్టీ శ్రేణులు మాత్రం ఆయనకు మార్కులు వేసేందుకు వెనుకాడుతున్నాయి. మొత్తానికి ఏపీ క్యాబినెట్ విస్తరణతో రేగిన అలజడి నివురుగప్పిన నిప్పులా ఇంకా కొనసాగుతోంది. రెండేళ్లలో ఎన్నికలు ఉన్నతరుణంలో పార్టీలో ఈ సంక్షోభం.. ప్రతిపక్షాలకు […]
దేవినేని నెహ్రూ కొడుకు అవినాష్ ఫ్యూచర్ ఏంటి..!
ఏపీలో కీలకమైన కృష్ణా జిల్లా రాజకీయాల్లోనే కాదు అప్పట్లో సమైక్యాంధ్రలోనే కాకలు తీరిన యోధుడిగా పేరున్న మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్ (నెహ్రూ) ఈ రోజు ఆకస్మికంగా మృతిచెందారు. కృష్ణా జిల్లా కంకిపాడు నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ఓసారి ఎన్టీఆర్ హయాంలో మంత్రిగా కూడాపనిచేశారు. కంకిపాడు నుంచి 1983-1985-1989-1994లలో టీడీపీ తరపున గెలిచిన నెహ్రూ…టీడీపీ ఆవిర్భావ సమయంలో ఆయన ఎన్టీఆర్ వైపే ఉన్నారు. ఎన్టీఆర్ చనిపోయేంత వరకు టీడీపీలోనే ఉన్న నెహ్రూ ఆ తర్వాత […]
బోండాకు సమయం చూసి వాతపెడతారా?
తాము ఆశించిన పదవులు దక్కని సందర్భాల్లో నేతలు తీవ్ర అసంతృప్తికి గురవడం.. అధిష్ఠానంపై తీవ్ర విమర్శలు చేయడం సర్వసాధారణమే!! ఒక్కోసారి ప్రభుత్వ విధానాలపైనే మాట్లాడి అటు అధిష్ఠానం దృష్టిలో, ఇటు ప్రజల దృష్టిలో చులకనగా మిగిలిపోతారు. ప్రస్తుతం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పరిస్థితి కూడా ఇలానే మారింది. కాపుల అభివృద్ధికి ఎంతో కష్టపడుతున్నామని ఒకపక్క టీడీపీ పెద్దలంతా నొక్కిచెబుతుంటే.. కాపులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని వ్యాఖ్యానించి.. అధిష్ఠానం దృష్టిలో నోటెడ్ అయ్యారు. అయితే వివాదం సద్దుమణిగినా.. మరి […]
2019 బెజవాడ టీడీపీ ఎంపీ సీటు మూడు ముక్కలాటేనా..!
ఏపీలో రాజకీయ చైతన్యానికి పురిటిగడ్డ కృష్ణా జిల్లా. ఇక బెజవాడ రాజకీయం తెలుగు రాష్ట్రాల్లోనే ఆసక్తికరంగా ఉంటుంది. కీలకమైన విజయవాడ ఎంపీ అయ్యేందుకు వివిధ పార్టీల తరపున ఎంపీ సీటు దక్కించుకునేందుకు అక్కడ నాయకులు చేయని ప్రయత్నాలు అంటూ ఉండవు. ఏపీలో విజయవాడ ఎంపీ సీటుకు ఉన్న క్రేజ్ అలాంటిది. ఇక్కడ నుంచి ఎంతోమంది మహామహులు, పారిశ్రామికవేత్తలు లోక్‌సభకు ఎంపికయ్యారు. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి వరుసగా రెండుసార్లు ఎంపీగా గెలిచిన లగడపాటి ఆ తర్వాత […]
కొడుక్కి రూల్స్ పెట్టిన చంద్రబాబు
ఏదైనా ఒక విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడం ఎంత ముఖ్యమో.. అందులో తప్పుడు లేకుండా మాట్లాడటం కూడా అంతే ముఖ్యం! మరీ ముఖ్యంగా రాజకీయాల్లో ఇప్పుడిప్పుడే అడుగులేస్తున్న సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్ లాంటి వారికి మరింత కీలకం!! అందుకు కొడుకు వేస్తున్న తప్పటడుగులను సరిదిద్దేందుకు చంద్రబాబు వెంటనే రంగంలోకి దిగారట. క్రమశిక్షణ విషయంలో స్టిక్ట్‌గా ఉండే చంద్రబాబు.. అంతకంటే స్ట్రిక్ట్ గా కొడుకు దగ్గర వ్యవహరించా రట. ముఖ్యంగా తెలుగు విషయంలో తడబడుతున్న కొడుక్కి […]
టీడీపీ నుంచి ఆ ఎంపీ సస్పెన్షన్..!
పార్టీ, సీఎం చంద్రబాబుపై తన అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేసిన చిత్తూరు ఎంపీ శివప్రసాద్ తన పోరు కొనసాగిస్తున్నారు. ఈవిషయాన్ని సీఎం చంద్రబాబు సీరియస్‌గా తీసుకున్నారు. బుజ్జగింపులకు లొంగకపోవడంతో.. ఆయనపై వేటు తప్పదని అంతా స్పష్టంచేస్తున్నారు. వేటువేస్తే ఆయన తదుపరి అడుగు ఏంటి? అనేది ఇప్పుడు అందరిలోనూ మెదులుతోంది. `బతికి ఉన్నంతకాలం చిత్తూరు ఎంపీని నేనే` అని ఆయన ధీమాగా చెబుతున్నారు. సస్పెండ్ అయితే.. ఇక వైసీపీలో ఆయన చేరే అవకాశాలున్నాయనే చర్చ ఇప్పుడు పార్టీ వర్గాల్లో […]