రామోజీ – రాధాకృష్ణ చంద్ర‌బాబుకు ఎవ‌రు ఎక్కువ‌..!

మీడియా మేనేజ్‌మెంట్‌లో సీఎం చంద్ర‌బాబును మించిన వారు లేర‌నే చెప్పుకోవాలి! ముఖ్యంగా అల‌నాడు ఎన్టీఆర్ అధికారంలోకి రావడానికి ప్ర‌ధాన కార‌ణ‌మైన ఈనాడుతోనే.. ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా వార్త‌లు రాయించి.. ప‌ద‌వి నుంచి దింపించేశారు. ఆ త‌ర్వాత అదే ప‌త్రిక ఆయ‌న‌కు అండ‌గా నిలబడుతూ వ‌స్తున్న విషయం ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. అయితే ఇప్పుడు ఈనాడు ప‌త్రికను ప‌క్క‌న పెట్టేయాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ని తెలుస్తోంది. దాని కంటే మిన్న‌గా, ప్ర‌భుత్వాన్ని భుజాల‌పై మోస్తున్న ఆంధ్ర‌జ్యోతిని అంద‌లం ఎక్కించాల‌ని భావిస్తున్నార‌ట‌. దీనికి […]

ఆ ఓట్లు ఎవ‌రివైపు ఉంటే వారిదే నంద్యాల‌

నంద్యాల ఉప ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ మ‌ధ్య గ‌ట్టి పోటీ ఎదుర‌య్యే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయి. గెలుపు కోసం అటు టీడీపీ, ఇటు వైసీపీ తీవ్రంగా ప్ర‌యత్నిస్తున్నాయి. నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా భూమా బ్రహ్మానందరెడ్డి, వైసీపీ అభ్యర్ధిగా శిల్పా మోహన్ రెడ్డి పోటీ పడుతున్నారు. గత ఎన్నికలను పరిశీలిస్తే… అప్పటి వైసీపీ అభ్యర్ధి భూమా నాగిరెడ్డి చేతిలో టీడీపీ అభ్యర్ధి శిల్పా మోహన్ రెడ్డి కేవలం రెండు వేల ఓట్ల తేడాతోనే ఓడిపోయారు. దీంతో […]

ఏలూరు టీడీపీ ఎంపీ సీటు మాగంటిదా ?  రాజీవ్‌దా ?

ప‌శ్చిమగోదావ‌రి జిల్లా అంటేనే టీడీపీకి కంచుకోట‌. ఈ కంచుకోట‌లో జిల్లా కేంద్రంగా ఉన్న ఏలూరు ఎంపీ సీటు కోసం ఇప్పుడు పార్టీలో ఆస‌క్తిక‌ర ఫైటింగ్ జ‌రుగుతోంది. ఇది పైకి పెద్ద‌గా క‌నిపించ‌క‌పోయినా ఈ ఎంపీ సీటుపై క‌న్నేసిన ఓ యంగ్ లీడ‌ర్ తెర‌వెన‌క ప్ర‌య‌త్నాలు తాను చేసుకుంటున్నాడు. ప్ర‌స్తుత సిట్టింగ్ ఎంపీ మాగంటిబాబు వివాద ర‌హిత రాజ‌కీయాలు చేస్తూ సౌమ్యుడిగా పేరున్న వ్య‌క్తి. త‌న ఫ్యామిలీకి కాంగ్రెస్‌తో ఉన్న ద‌శాబ్దాల అనుబంధాన్ని తెంచుకున్న మాగంటి టీడీపీలోకి వ‌చ్చారు. […]

బ్రాహ్మ‌ణుల‌ను వాడేస్తున్న పొలిటిక‌ల్ నేత‌లు! 

రాష్ట్రంలో మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు వ్య‌వ‌హారంతో పాలిటిక్స్ అన్నీ ఒక్క‌సారిగా బ్రాహ్మ‌ణుల చుట్టూ చేరిపోయాయి. బ్రాహ్మ‌ణ కార్పొరేష‌న్ నుంచి ఐవైఆర్‌ను తొల‌గించ‌డాన్ని తీవ్ర‌స్థాయిలో త‌ప్పుప‌డుతున్న విపక్షం వైసీపీ.. ఈ విష‌యానికి కాస్త పొలిటిక‌ల్ క‌ల‌రింగ్ ఇచ్చి బెనిఫిట్ పొందేందుకు తీవ్రంగా య‌త్నిస్తోంది. మ‌రోప‌క్క‌, చంద్ర‌బాబుపై పీక‌ల్లోతు ఆగ్ర‌హంతో ఉన్న కాపు ఉద్య‌మ నేత మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం కూడా ఇప్పుడు బ్రాహ్మ‌ణుల‌ను సెంట్రిక్‌గా తీసుకుని కామెంట్లు చేశారు. 2019లో బ్రాహ్మ‌ణులు అంతా ఏక‌మై బాబుకు […]

పవన్ పోటీకి దిగితే బాబు పొలిటికల్ అస్త్రం రెడీనా..!

2019 ఎన్నిక‌ల్లో అనంత‌పురం నుంచి పోటీ చేస్తాన‌ని జ‌న‌సేన అధినేత, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌క‌టించ‌డంతో ఇప్పుడు ఆయ‌న ఏ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీచేస్తార‌నే విష‌యంపై సందిగ్ధం నెల‌కొంది. అయితే తెలుగుదేశం పార్టీ నుంచి అనంత‌పురంలో సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు పోటీలో ఉండ‌టంతో అంతా ఉత్కంఠ‌గా ఎదురుచూస్తున్నారు. అయితే ప‌వ‌న్‌పై పోటీచేసే అభ్య‌ర్థి విష‌యంలో టీడీపీ నేత‌లు, ముఖ్యంగా ఏళ్లుగా రాజ‌కీయాల‌ను శాసిస్తున్న జేసీ వ‌ర్గం ఒక క్లారిటీకి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అక్క‌డి సామాజిక‌వ‌ర్గ […]

తూర్పు పాలిటిక్స్‌లో పెద్ద హాట్ టాపిక్‌గా టీడీపీ ఎమ్మెల్యే

ఏపీలో వ‌చ్చే ఎన్నిక‌లకు కాస్త ముందుగా క‌ప్పుల త‌క్కెడ‌లో ఖాయం కానున్నాయి. ఈ పార్టీలో వాళ్లు ఆ పార్టీలోకి, ఆ పార్టీలో వాళ్లు ఈ పార్టీలోకి జంప్ చేసేయ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు మ‌రో రెండేళ్ల టైం కూడా లేదు. దీంతో ఎవ‌రికి వారు వ‌చ్చే ఎన్నిక‌ల్లో టిక్కెట్టు సంపాదించి గెలిచేందుకు ఎవ‌రి ప్ర‌య‌త్నాల్లో వారు ఉన్నారు. వ‌రుస‌గా రెండోసారి అధికారం నిలుపుకునేందుకు టీడీపీ, తొలిసారి గెలిచేందుకు వైసీపీ హోరాహోరీగా పోరాడుతుంటే కొత్త పార్టీ జ‌న‌సేన […]

కొత్త టార్గెట్‌: ముందు జ‌గ‌న్‌.. త‌ర్వాత చంద్ర‌బాబు

అధికార పార్టీ నాయ‌కులు చేసే అవినీతి, ప్ర‌జా వ్య‌తిరేక నిర్ణ‌యాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళితే.. ప్ర‌తిప‌క్షానికైనా, ఇత‌ర పార్టీల‌కైనా మ‌నుగ‌డ ఉంటుంది. అప్పుడే ఆయా పార్టీల బ‌లం పెరిగే అవ‌కాశాలు ఉన్నాయి. ఇదే ఇప్ప‌టివ‌ర‌కూ వ‌స్తోంది. కానీ దీనికి భిన్నంగా ఏపీ కాంగ్రెస్ నిర్ణ‌యించింది. టీడీపీని కాకుండా .. ఏపీలో ఎలాగైనా అధికారంలోకి రావాల‌ని తీవ్రంగా ప్ర‌యత్నిస్తున్న ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్సార్‌సీపీ అధినేత జ‌గ‌న్‌ను ల‌క్ష్యంగా చేసుకోవాల‌ని హైక‌మాండ్ నుంచి స్ప‌ష్ట‌మైన ఆదేశాలు జారీఅయ్యాయ‌ట‌. దీని వెనుక బ‌ల‌మైన […]

పోటీపై కుండ బద్దలు కొట్టినట్టు చెప్పిన బాలయ్య

కొద్ది రోజులుగా ఏపీ పాలిటిక్స్‌లో ఓ ఇష్యూపై తెగ చ‌ర్చ న‌డుస్తోంది. ప్ర‌ముఖ సినీన‌టుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ వ‌చ్చే ఎన్నిక‌ల్లో నియోజ‌క‌వ‌ర్గం మారుతున్నార‌న్న‌దే ఆ వార్త. బాల‌య్య‌కు హిందూపురంలో ఇటీవ‌ల బాగా వ్య‌తిరేక‌త పెరుగుతోంద‌ని, ఆయ‌న 2019 ఎన్నిక‌ల్లో హిందూపురంకు బ‌దులుగా కృష్ణా జిల్లాలోని గుడివాడ లేదా మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గాల్లో ఏదో ఒక నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తారని మీడియాలోను, సోష‌ల్ మీడియాలోను వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ వార్త‌ల‌కు బాల‌య్య ఎట్ట‌కేల‌కు క్లారిటీ […]

టీ-టీడీపీకి టైమ్ ఇవ్వని లోకేశ్

వ‌చ్చే 2019 ఎన్నిక‌ల్లో ఎట్టి ప‌రిస్థితిలోనూ తెలంగాణ‌లో మ‌న పార్టీ అధికారంలోకి వ‌చ్చి తీరుతుంది.. త‌మ్ముళ్లూ.. ! అంటూ భ‌రోసా నింపిన టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ ఇటీవ‌ల కాలంలో తెలంగాణ టీడీపీ నేత‌ల ముఖం చూడ‌లేదు. ఒక ర‌కంగా టీడీపీ అధినేత ఏపీ అభివృద్ధి, ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాలు వంటి వాటిలో తీరుబ‌డి లేకుండా ఉన్న నేప‌థ్యంలో తెలంగాణ‌లో టీడీపీని న‌డిపించే బాధ్య‌త‌ను లోకేశ్ భుజాన వేసుకున్నారు. తెలంగాణ నేత‌ల‌తో వారాల త‌ర‌బ‌డి చ‌ర్చించి.. […]