కాక రేపుతున్న తెలంగాణ పాలిట్రిక్స్…!

తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. ఎన్నికలు సమీపిస్తుండటంతో అన్ని ప్రధాన పార్టీల నేతలు తెలంగాణపై ఫోకస్ పెట్టాయి. తెలంగాణ విమోచన దినోత్సవం రోజునే ఇద్దరు అగ్రనేతలు తెలంగాణలో పర్యటించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఒకేరోజు తెలంగాణలో పర్యటించనున్నారు. సెప్టెంబర్‌ 17న తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ, సోనియా గాంధీ తెలంగాణలో పర్యటించేందుకు ఏర్పాట్లు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. సెప్టెంబర్‌ 17న ప్రధానమంత్రి మోదీ సభకు బీజేపీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. […]

రేవంత్ పై జగ్గారెడ్డి ఘాటు లేఖ ..షాక్ లో కాంగ్రెస్ కార్యకర్తలు !

టీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన ఆరు నెలల తరువాత కాంగ్రెస్ పార్టీలో నిరసన గళం వినిపించింది. రేవంత్ రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగిస్తూ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని కొందరు నాయకులకు నచ్చకపోయినా సరేలే అనుకొని మిన్నకుండిపోయారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా స్థాపించిన తెలుగుదేశం పార్టీలో ఉండి చంద్రబాబుకు నమ్మిన బంటుగా పనిచేసి ఆ తరువాత ఓటుకు నోటు కేసులో ఇరుక్కొని .. రాజకీయంగా ఇబ్బందులు పడి తప్పనిసరి పరిస్తితుల్లో రేవంత్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాడని కొందరు […]

శైలజా..రేవంత్‌.. మధ్యలో 15 లక్షలు

కాంగ్రెస్‌ పార్టీ.. జాతీయస్థాయిలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రాభవం కోల్పోయింది. తెలంగాణలో చెప్పుకోదగ్గ ప్రజాప్రతినిధులు ఉన్నారు కానీ ఏపీలోమాత్రం దారుణం.. పరిస్థితి ఎంతవరకు వచ్చిందంటే పార్టీ కార్యకలాపాల నిర్వహణకు కూడా దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ రాష్ట్రం విడిపోయిన అనంతరం కొద్దిరోజుల పాటు ఏపీసీసీ, టీపీసీసీ కమిటీలో ఒకే చోట నిర్వహించారు. ఏపీసీసీ ఇందిరాభవన్‌నుంచి కార్యకలాపాలు నిర్వహించగా.. టీపీసీసీ గాంధీభవన్‌ నుంచి నిర్వహించింది. ఆ తరువాత ఏపీసీసీ కార్యాలయం విజయవాడికు మారిపోయింది. విజయవాడకు మారిన అనంతరం […]

ఢిల్లీకి వచ్చి సమాధానం చెప్పండి..

హుజూరాబాద్ ఉప ఎన్నికలు జరిగాయి.. బీజేపీ గెలిచింది.. టీఆర్ఎస్ ఓడింది.. కాంగ్రెస్ పార్టీ కూడా ఓడిపోయిది. ఇది అందరి తెలిసిన విషయమే. అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాత్రం ఈ ఫలితాలను సీరియస్ గా తీసుకొంది. టీ.కాంగ్రెస్ నాయకులపై ఫైరవుతోంది. ఎన్నికల్లో ఓడిపోవడం గురించి కాదు ఈ బాధ.. పార్టీకి వచ్చిన ఓట్ల గురించే అధిష్టానం తట్టుకోలేకపోతోంది. తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెబుతున్న నాయకులను ఉప ఎన్నికల్లో ఇంత దారుణంగా ఎలా ఓడిపోయామని […]

రాహుల్ స్వామి మాటల్ని నిజం చేస్తాడా?

ఈ తరం పొలిటీషియన్లలో రాహుల్‌ గాంధీ మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌. ఆయనకు పెళ్ళంటే ఇష్టం లేదో, పెళ్ళి చేసుకుంటే రాజకీయాల్లో తన కుమారుడికి గుర్తింపు తగ్గిపోతుందేమోనని ఆయన తల్లి సోనియాగాంధీ భయపడుతున్నారోగానీ మోస్ట్‌ బ్యూటిఫుల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌ అనిపించుకున్న రాజీవ్‌గాంధీ పుత్రరత్నం రాహుల్‌గాంధీకి ఇంకా పెళ్ళి కాలేదు. ఇంకెప్పటికీ పెళ్ళి చేసుకోడా? అని కాంగ్రెసు నాయకులే తమ యువ నాయకుడి గురించి ఆశ్చర్యపోతుంటారు. ఈ టైమ్‌లో బిజెపి నేత సుబ్రమణ్యస్వామి ట్విట్టర్‌ వేదికగా రాహుల్‌గాంధీ పెళ్ళిపై పంచ్‌లు […]

టి కాంగ్రెస్ కి భారమవుతున్న ఆ ఇద్దరు!

తెలంగాణ కాంగ్రెసు నాయకులు ఢిల్లీకి వెళ్ళి వస్తున్నారే తప్ప, తెలంగాణలో పార్టీని బాగు చేయలేకపోతున్నారు. రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేసే బాధ్యత ఆయా రాష్ట్రాల్లోని పార్టీ నాయకత్వాలదే. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెసు పార్టీకి నాయకత్వమే లేదు. అది విభజనతో జరిగిన నష్టం. తెలంగాణలో అలా కాదు కదా. తెలంగాణలో టిఆర్‌ఎస్‌ దెబ్బకి కాంగ్రెసు నాయకత్వం కుదేలైంది. ‘మేం తెలంగాణ ఇచ్చినా, మీరు పార్టీని బాగు చేయలేకపోతున్నారు’ అని తెలంగాణ నుంచి వెళ్ళిన ప్రతి నాయకుడికీ సోనియాగాంధీ తలంటు పోసేస్తున్నారట. […]