టీటీడీ చైర్మ‌న్ రేసులో తెర‌పైకి బీసీ ఎమ్మెల్యే

టీటీడీ చైర్మ‌న్ రేసులో ఏపీలో అధికార టీడీపీ నుంచి రోజుకో కొత్త‌పేరు తెర‌మీద‌కు వ‌స్తోంది. నిన్న‌టి వ‌ర‌కు ఈ పోస్టు రేసులో ఎంపీలు రాయ‌పాటి సాంబ‌శివ‌రావు, మాగంటి ముర‌ళీమోహ‌న్ పేర్లు బ‌లంగా వినిపించాయి. ఇక ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణ‌మ‌నాయుడు పేరు సైతం తెర‌మీద‌కు వ‌చ్చింది. ఇక ఇప్పుడు ఈ జాబితాలో ఇప్పుడు కృష్ణా జిల్లా పెడ‌న ఎమ్మెల్యే, బీసీ నేత‌గా ఉన్న కాగిత వెంక‌ట్రావు పేరు తెర‌మీద‌కు వ‌చ్చింది. బ‌ల‌మైన బీసీ నేత‌గాను, సీనియ‌ర్ ఎమ్మెల్యేగా ఉన్న […]

టీటీడీ చైర్మ‌న్ కోసం టీడీపీలో నాలుగు స్తంభాలాట‌

ఏపీలో కీల‌క‌మైన నామినేటెడ్ పోస్టుల్లో టీటీడీ చైర్మ‌న్ పోస్టు ఒక‌టి. ప్ర‌పంచంలోనే అత్య‌ధిక ధ‌నిక దేవాల‌య‌మైన తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం చైర్మ‌న్ పోస్టుకు మ‌మూలు క్రేజ్ ఉండ‌దు. ఈ ధర్మకర్తల మండలికి ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. టీటీడీ చైర్మన్ పదవి కోసం తలపండిన రాజకీయ నేతల నుంచి ఎందరో పోటీ పడతారు. ఈ పోస్టుతో పాటు ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లిలో స‌భ్య‌త్వం కోసం ఇత‌ర రాష్ట్రాల సీఎంలు, కేంద్ర‌మంత్రులు కూడా సిఫార్సులు కూడా వ‌స్తాయి. ఈ […]

టీటీడీ చైర్మ‌న్‌గా బాబు ఓటు ఆయనకే

టీటీడీ చైర్మ‌న్ ప‌దవికి తెలుగుదేశం పార్టీ ఎంపీలు జోరుగా లాబీయింగ్ మొద‌లుపెట్టార‌ట‌. శ్రీ‌వారి సేవ‌లో త‌రించాలంటే .. ముందుగా సీఎం చంద్ర‌బాబు ఆశీర్వాదం త‌ప్ప‌నిస‌రి. దీంతో ఇప్పుడు ఈ ప‌ద‌వి ఆశిస్తున్న నేత‌లు.. చంద్ర‌బాబును ప్ర‌సన్నం చేసుకునే ప‌నిలో నిమ‌గ్న‌మ‌య్యారు. ఇందులో ఎంపీ రాయ‌పాటి సాంబ‌శివ‌రావు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కానీ చంద్ర‌బాబు దృష్టిలో వేరే వ్య‌క్తి పేరు మెద‌లుతోంద‌ట‌. దీంతో ఇక రాయ‌పాటికి ఈసారీ నిరాశే ఎదుర‌వ‌వ‌చ్చ‌నే ప్ర‌చారం వినిపిస్తోంది. ఈసారి ఈప‌ద‌వి వివాద‌ర‌హితుడు, త‌న‌కు […]

ముర‌ళీమోహ‌న్ వార‌సురాలు వ‌స్తోంది!

ప్ర‌స్తుతం ఇరు రాష్ట్రాల్లో వార‌స‌త్వ రాజ‌కీయాలు న‌డుస్తున్నాయి! 2019 ఎన్నిక‌ల్లో త‌మ కొడుకులు, కూతుళ్ల‌ను రాజ‌కీయాల్లోకి తీసుకొచ్చేందుకు ఇప్ప‌టినుంచే సీనియ‌ర్ నాయ‌కులు ఏర్పాట్లుచేస్తున్నారు. ఈ త‌రుణంలో త‌న‌ కోడ‌లిని రాజ‌కీయ వార‌సులిగా తీసుకొస్తున్నారు రాజ‌మండ్రి ఎంపీ ముర‌ళీమోహ‌న్‌!! భ‌విష్య‌త్తులో రాజ‌మండ్రి ఎంపీగా ఆమెతో పోటీచేయించేందుకు ఇప్ప‌టినుంచే ఆమెను సిద్ధం చేస్తున్నారు! తూర్పు, ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా రాజ‌కీయాల్లో రాజ‌మండ్రి పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. కాంగ్రెస్ నాయ‌కుడు ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమ‌ర్..కు ఆ నియోజ‌క‌వ‌ర్గంలో మంచి ప‌ట్టు ఉంది. […]