యాక్షన్ హీరో గోపీచంద్ త్వరలోనే ప్రముఖ దర్శకుడు తేజతో `అలిమేలు మంగ వెంకటరమణ` అనే టైటిల్‌తో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. జయం, నిజం సినిమాల తర్వాత గోపీచంద్, తేజ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ఇది. అయితే ఆ చిత్రాల్లో విలన్‌గా నటించిన గోపీచంద్ ఈ సినిమాలో హీరోగా నటించనున్నారు. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తుందని బలంగా టాక్ వినిపిస్తోంది. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ చిత్రం గురించి ఓ ఇంట్రస్టింగ్ […]
Tag: Latest news
ఎన్టీఆర్‌తో కొరటాల..మరి బన్నీ సినిమా ఎప్పుడంటే?
ప్రస్తుతం `ఆర్ఆర్ఆర్` సినిమా చేస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన 30వ సినిమాను కొరటాల శివతో చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దీనిపై అధికారిక ప్రకటన రాగా.. ఈ చిత్రం జూన్‌లో సెట్స్ మీదకు వెళ్లనుంది. అలాగే వచ్చే ఏడాది ఏప్రిల్ 29న విడుదల కానున్న ఈ చిత్రాన్ని నందమూరి కళ్యాణ్‌రామ్ సమర్పణలో యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా చిత్రంగా నిర్మించనున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ ప్రకటించిన వెంటనే స్టైలిష్ […]
వైరల్ పిక్: బండ్ల గణేష్‌కి కరోనా..సుమ ముందు జాగ్రత్తే మంచిదైంది!
సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ రెండో సారి కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. `వకీల్ సాబ్` సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు వెళ్లి వచ్చిన మరుసటి రోజు నుంచి ఒళ్లు నొప్పులు, జ్వరంతో బాధ పడుతున్న బండ్ల కరోనా టెస్ట్‌లు చేయించుకోగా.. పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో ఐసీయూలో ఉంచి బండ్ల గణేశ్ కు వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఇదిలా […]
పీక కోస్తా అంటూ నాగబాబుకు భార్య వార్నింగ్..ఏం జరిగిందంటే?
సినీ నటుడు, జనసేన పార్టీ నాయకుడు, మెగా బ్రదర్ నాగబాబుకు ఆయన భార్య పీక కోస్తానని వార్నింగ్ ఇచ్చిందట. ఈ విషయాన్ని స్వయంగా నాగబాబునే తెలిపారు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, నిర్మాతగా, సీరియల్ యాక్టర్‌గా, షోలలో జడ్జ్‌గా ఇలా ఎన్నో రకాలుగా ప్రేక్షకులను అలరించిన నాగబాబు.. తరచూ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటిస్తూనే ఉంటారు. ఈ క్రమంలోనే ఇటీవల నాగబాబు అభిమానులతో లైవ్ చాట్ నిర్వహించగా.. `ఏం సార్.. మీరు మళ్లీ పెళ్లి చేసుకుంటారా?` అని […]
ఐపీఎల్ 2021:రాజస్థాన్‌కి బిగ్ షాక్..ఆ కీలక ఆటగాడు ఔట్!
రాజస్థాన్ రాయల్స్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. జట్టులో కీలక ఆడగాడు, ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఐపీఎల్ 2021లో భాగంగా సోమవారం జరిగిన నాలుగో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో పంజాబ్ కింగ్స్ తలపడిన సంగతి తెలిసిందే. చివరి వరకు ఎంతో ఉత్కంఠభరింతగా సాగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో యువ పేసర్ రియాన్ పరాగ్ విసిరిన బంతిని లాంగాన్ దిశగా క్రిస్‌గేల్ […]
`విరాటపర్వం` నుంచి కొత్త పోస్టర్..ఆకట్టుకుంటున్న సాయిపల్లవి!
దగ్గుబాటి రానా, సాయి పల్లవి జంటగా నటిస్తున్న తాజా చిత్రం `విరాటపర్వం`. వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 30న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో అలాగే నవీన్ చంద్ర, ప్రియమణి, నందితా దాస్, నివేదా పేతురాజ్, ఈశ్వరీరావు తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇదిలా ఉంటే.. నేడు ఉగాది పండగ సందర్భంగా ఈ చిత్రం నుంచి […]
నీలాంబరితో సిద్ధ సరసాలు..అదిరిన `ఆచార్య` న్యూ పోస్టర్!
మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో `ఆచార్య` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సిద్ధ అనే కీలక పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్నాడు మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో చిరుకు జోడీగా కాజల్ అగర్వాల్, చరణ్‌కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా క్లైమాక్స్ చిత్రికరణ జరుపుకుంటోంది. ఇదిలా ఉంటే.. నేడు ఉగాది పండగా సందర్భంగా `షడ్రుచుల సమ్మేళనం సిద్ధ, నేలంబరిలా […]
తెలంగాణలో కొత్తగా 3,052 కరోనా కేసులు..రికవరీ ఎంతంటే?
కరోనా వైరస్.. ప్రస్తుతం ప్రపంచదేశాలను అల్లకల్లోలం చేస్తున్న సంగతి తెలిసిందే. అతి సూక్ష్మజీవి అయిన కరోనా.. మానవ మనుగడకే గండంగా మారుతుందని ఎవ్వరూ ఊహించలేదు. ప్రస్తుతం ఈ మహమ్మారి అంతు చూసేందుకు.. అన్ని దేశాల్లోనూ, రాష్ట్రాల్లోనూ జోరుగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. అయినప్పటికీ, గత రెండు వారాలుగా కరోనా మరింత వేగంగా విజృంభిస్తోంది. తెలంగాణలో కూడా భారీ సంఖ్య కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. గత […]
ఉగాది స్పెషల్..`ఆర్ఆర్ఆర్` నుంచి న్యూ పోస్టర్ విడుదల!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్`. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ ఆలియా భట్, బ్రిటన్ మోడల్ ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. […]









